Breaking News

ఆకాశమే నీ హద్దురా కాంబో రిపీట్‌!

Published on Mon, 02/26/2024 - 11:38

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో సూర్య. సూరరై పోట్రు, జై భీమ్‌ చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రల్లో తన అసమాన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించిన ఈయన చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కంగువ చిత్రానికి తన గొంతుతో పరిపూర్ణత చేకూర్చే పనిలో ఉన్నారు. సోషల్‌ అంశాలకు పీరియడ్‌ కథాంశాలను జోడించి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ఇందులో సూర్యలోని మరో కోణాన్ని చూస్తారు.

10 భాషల్లో కంగువా
బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని చిరుతై శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీ డబ్బింగ్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 3డీ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న కంగువ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు కాగా తదుపరి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) వంటి హిట్‌ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే!

విద్యార్థిగా సూర్య!
తాజా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఏమిటంటే ఇందులో సూర్యతో పాటు మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌, నజ్రియా ముఖ్యపాత్రలు పోషించనున్నారట. ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సూర్య కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు సమాచారం. కంగువ చిత్రంలో గిరి వాసుల తరఫున పోరాడే వీరుడు పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకుని నటించిన సూర్య తాజా చిత్రం పురనానూరు కోసం విద్యార్థిగా మారడానికి కసరత్తులు చేస్తున్నారట. సూర్య తన 2 డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం మేలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

చదవండి: టాలీవుడ్‌ డైరెక్టర్లపై మెగాస్టార్‌ చిరంజీవి కీలక వ్యాఖ్యలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)