Breaking News

బ్రో ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published on Sun, 08/20/2023 - 10:41

టాలీవుడ్‌ హీరోలు పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రో. ప్రియ ప్రకాశ్‌ వారియర్‌, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్‌. మాతృకలో సినిమాను డైరెక్ట్‌ చేసిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. జూలై 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్లు రాబట్టడంలోనూ విఫలమైంది. డైరెక్టర్‌ సినిమా కథను లైట్‌ తీసుకుని హీరోను హైలైట్‌ చేసేందుకే ఎక్కువ కష్టపడ్డాడని విమర్శలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ మూవీ  ఆగస్టు 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అంటే ఈ శుక్రవారం ఓటీటీలో ల్యాండ్‌ అయ్యేందుకు బ్రో సిద్ధమయ్యిందన్నమాట! థియేటర్‌లో సినిమా చూడటం మిస్‌ అయినవారు, లేదంటే మరోసారి బ్రోను చూడాలనుకునేవారు ఈ ఫ్రైడే ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

బ్రో సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మానందం, రోహిని, వెన్నెల కిశోర్‌, రాజా చెంబోలు తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు. తమన్‌ సంగీతం అందించగా నవీన్‌ నూలి ఎడిటర్‌గా వ్యవహరించాడు.

చదవండి: సాయిధరమ్‌ తేజ్‌ రీల్‌ చెల్లెలు.. ఇంత అందంగా ఉందేంటి బ్రో!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)