Breaking News

'మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు'.. బ్రహ్మనందం కామెంట్స్ వైరల్!

Published on Sat, 06/21/2025 - 21:41

మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కన్నప్ప'. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ప్రమోషన్స్‌తో బిజీగా మేకర్స్. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హాస్యనటుడు బ్రహ్మనందం యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

బ్రహ్మనందంను యాంకర్‌ సుమ అడిగిన ప్రశ్నకు ఈవెంట్‌లో నవ్వులు పూయించారు. ఒకవేళ మోహన్ బాబు గారి సినిమాల్లో మిమ్మ‍ల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఏ సినిమాను ఎంచుకుంటారు? అని ప్రశ్నించింది. అందులో మూడు ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఒకటి అల్లుడుగారు, రెండోది పెదరాయుడు, మూడో ఆప్షన్‌గా అసెంబ్లీ రౌడీగా చెప్పింది.

దీనికి బ్రహ్మనందం అసెంబ్లీ రౌడీ సినిమాను ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో మొదట నన్నే అడిగారని అన్నారు. అయితే తాను రిజెక్ట్‌ చేశానని తెలిపారు. ఆ తర్వాత మోహన్‌ బాబు మా ఇంటికి ప్రాధేయపడితే ఏ చేస్తాం సుమ? అని సర్లే చేసుకోపో అని చెప్పానంటూ నవ్వులు పూయించారు. అయితే యమదొంగలో కూడా మిమ్మల్నే అడిగారంటా అని సుమ మరో ప్రశ్న వేసింది. యమదొంగలో మాత్రం నన్ను అడగలేదు.. అలాంటి పాత్రలకు ఆయనైతేనే కరెక్ట్‌గా సరిపోతాడు.. బయట సరిపోతాడు.. అలాగే స్క్రీన్ మీద కూడా ఆయనే సెట్‌ అవుతాడంటూ అందరినీ నవ్వించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతేకాకుండా మోహన్‌ బాబులో మీకు నచ్చేది? నచ్చనిది ఏది? అంటూ సుమ అడిగింది. దీనికి మోహన్ బాబు అంటే నాకు అస్సలు నచ్చడంటూ సరదాగా మాట్లాడారు. ఓ మహ నటుడిని ఎవరు ఇష్టపడరమ్మా? అంటూ నవ్వుతూ మాట్లాడారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)