Breaking News

మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ

Published on Sun, 11/23/2025 - 18:54

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. అప్పుడప్పుడు ఏదో ఓ కార్యక్రమంలో కనిపించడం తప్పితే పెద్దగా వివాదాల్లోనూ ఉండరు. అలాంటిది బ్రహ్మీ.. తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫొటో తీసుకుందామని అంటే ఇవ్వలేదని ఓ ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా బ్రహ్మానందం ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.

'ఉదయాన్ని ఓ వీడియో చూసి నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్‌బాబు ఫంక్షన్‌కి వెళ్లాను. బాగా రాత్రయిందని వెళ్లిపోయే హడావుడిలో ఉన్నాను. అంతలో దయా అన్న ఎదురయ్యాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. 'రాన్న రాన్న ఫొటో తీసుకుందాం' అని దయా అన్న అడిగాడు. ఫొటో వద్దు ఏమీ వద్దు అని నేను అక్కడినుంచి వచ్చేశా. చాలామంది మిత్రులు దీన్ని అపార్థం చేసుకున్నట్లున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. మంచి మిత్రులం. నన్ను ఎంతో అభిమానంగా, ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం'

(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో రవితేజ, త్రివిక్రమ్ కొడుకులు.. ఫొటో వైరల్)

'మేం మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆయనతో ఉన్న చనువుతో అలా సరదాగా తోసేశాను. దాన్ని నేను ఏదో కావాలని చేసినట్లు కొంతమంది మీడియా మిత్రులు అపార్థం చేసుకున్నారు. అలాంటిదేం లేదు. తర్వాత కూడా ఆయన, నేను ఫంక్షన్‌లో చాలాసేపు మాట్లాడుకున్నాం. అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం. దీనిపై క్లారిటీ ఇవ్వడానికే వీడియో చేస్తున్నాను' అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోహన్ బాబు ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. ఈ ఈవెంట్‌లోనే బ్రహ్మానందం-దయాకర్ రావు మధ్య ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు స్వయంగా బ్రహ్మీనే క్లారిటీ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా బాలనటుడు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)