Breaking News

రెండేళ్ల క్రితమే షూటింగ్‌.. ఇప్పుడు ఓటీటీకి వస్తోన్న స్పోర్ట్స్‌ డ్రామా!

Published on Tue, 10/15/2024 - 14:44

ఇటీవల థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీ రావడం సహజం. ఎక్కువశాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడిన తర్వాత నెల రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చేస్తుంటాయి. అయితే షూటింగ్ పూర్తయిన దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీకి రావడం చాలా అరుదు. కానీ హిందీలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ది మిరిండా బ్రదర్స్ రెండేళ్ల అనంతరం డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.

తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వెల్లడించింది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీకి వస్తోన్న ఈ మూవీలో హర్షవర్దన్ రాణే, మీజాన్ జాఫెరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంజయ్ గుప్తా దర్శకత్వం వహించారు. ది మిరిండా బ్రదర్స్ సినిమా అక్టోబర్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‍కు రానుంది.

ఆతిష్, కాబిల్, షూటౌట్ అట్ లోఖంద్వాలా, కాంటే లాంటి బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన సంజయ్ గుప్తా.. ది మిరండా బ్రదర్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇద్దరు సోదరులు రెండు వేర్వేరు ఫుట్‍బాల్ జట్లకు ఆడుతూ పోటీపడడం చుట్టూ తిరిగే కథే ఈ మూవీ. ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితమే జరిగింది. 2022లో గోవాలోనే ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించారు. చిత్రీకరణ పూర్తయినప్పటికీ సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)