Breaking News

గ్రీస్‌లో ఆదిపురుష్ భామ.. అతనితో డేటింగ్ నిజమేనా!

Published on Tue, 07/30/2024 - 16:10

ఆదిపురుష్ భామ, బాలీవుడ్ నటి కృతి సనన్‌ తెలుగువారికి సుపరిచితమే. ప్రభాస్ సరసన ఆదిపురుష్‌ చిత్రంలో సీతగా మెప్పించింది. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో అభిమానులను అలరించలేకపోయింది. ఓం రౌత్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇటీవల క్రూ మూవీతో ఫ్యాన్స్‌ను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్రీస్‌లో విహరిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న కబీర్ బహియాతో చిల్ అవుతోన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

గతంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పలుసార్లు రూమర్స్ వినిపించాయి. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లోనూ ఈ జంట పార్టీలో సందడి చేశారు. అ‍ప్పటి నుంచే వీరిద్దరిపై  డేటింగ్‌లో ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే కబీర్‌తో రిలేషన్‌పై ఇప్పటివరకు కృతి సనన్‌ స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరు జంటగా గ్రీస్‌లో కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా కృతి సనన్ ఇటీవల తన పుట్టినరోజును కబీర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

lk

పదేళ్ల ఏజ్ గ్యాప్‌..

అయితే ఈ జంట మధ్య వయసు అంతరం ఎక్కువగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కృతి సనన్‌ వయస్సు 34 ఏళ్లు కాగా.. కబీర్ బహియాకు వయస్సు 24 ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల  ఏజ్ గ్యాప్‌ ఉంది. ఇది చూస్తుంటే తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్‌తో ఆదిపురుష్‌ భామ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి సనన్ దో పట్టి మూవీలో కనిపించనుంది. ఇందులో కాజోల్, షహీర్ షేక్ కూడా నటించారు. 
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)