Breaking News

మూడు లగ్జరీ ఫ్లాట్స్‌ కొన్న బిగ్‌బాస్‌ విన్నర్‌.. ధర ఎన్ని కోట్లంటే?

Published on Thu, 02/13/2025 - 10:55

గౌహర్‌ ఖాన్.. బాలీవుడ్‌లో ఆమె పేరు చాలా పాపులర్‌. బిగ్‌బాస్‌ సీజన్‌-7 విన్నర్‌, టీవీ స్టార్‌,మోడల్‌,హీరోయిన్‌ ఇలా పలు రంగాల్లో రాణించింది. అంతేకాదు మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్ సినిమా శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌తో తెలుగు వారికి గౌహర్‌ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్‌ సాంగ్‌తో అభిమానులను ఓ రేంజ్‌లో అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్‌ భామ.

అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబయిలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వర్సోవా ప్రాంతంలో దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మూడు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసింది. వీటిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. కాగా.. 2013లో బిగ్ బాస్ సీజన్‌- 7 టైటిల్‌ గెలిచిన  గౌహర్ ఖాన్, మోడలింగ్‌తో పాటు హిందీ చిత్రాల్లో నటించింది.

18 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన గౌహర్‌ఖాన్‌ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించారు. గేమ్‌, రాకెట్‌ సింగ్‌, ఫీవర్‌, బేగం జాన్‌ వంటి చిత్రాలతో పాటు తాండవ్‌ వెబ్‌ సిరీస్‌ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. 2020లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌(25)ను పెళ్లాడింది. ఆమె కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో విమర్శలొచ్చాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)