Breaking News

ఫేక్‌ కలెక్షన్స్‌నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు: సన్నీ డియోల్

Published on Mon, 06/23/2025 - 17:14

ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్‌ కొట్టిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్‌-2 మూవీలో నటిస్తున్నారు. అంతేకాకుండా నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలోనూ కనిపించనున్నారు.

అయితే తాజా ఇంటర్వ్యూకు హాజరైన సన్నీ డియోల్ మూవీ కలెక్షన్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానులు ఫేక్ కలెక్షన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు ఎలాంటివారో తనకు అర్థం కావడం లేదన్నారు. నకిలీ బాక్సాఫీస్ నంబర్స్ చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. సినీ పరిశ్రమ ప్రమాణాల కంటే కేవలం హైప్‌పైనే ఆధారపడడంపై సన్నీ డియోల్ తప్పుబట్టారు.

సన్నీ డియోల్ మాట్లాడుతూ.. 'ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అభిమానులు వాస్తవికతను నమ్మడానికి ఇష్టపడరు. బాక్సాఫీస్ సంఖ్యలను పెంచి కానీ వాస్తవానికి భిన్నంగా చూపిస్తారు. టిక్కెట్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం.. నకిలీ బాక్సాఫీస్ సంఖ్యలు చూపించడం సరైంది కాదు.  అది అలా ఉండకూడదు.  మిమ్మల్ని మీరు హిట్ చేసుకోవడానికి ఇది మార్గం కాదు. అందువల్లే చాలా మంది యువకుల కథలు బయటకు రావడం లేదు. ప్రజలు కూడా మంచి కథకు విలువ ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో కథ ప్రభావం కంటే ఫేక్ కలెక్షన్స్ ద్వారా విజయం డిసైడ్ చేస్తున్నారు'  అని అన్నారు.

సన్నీ డియోల్ చివరిసారిగా 'జాట్' చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ ద్వారానే గోపీచంద్ మలినేని హిందీలో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో రెజీనా , రణదీప్ హుడా, సయామి ఖేర్, రమ్య కృష్ణన్ కూడా నటించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)