Breaking News

తండ్రి మరణించిన ఆస్పత్రిలోనే హీరో కన్నుమూత

Published on Tue, 07/28/2026 - 19:41

బాలీవుడ్ దిగ్గజ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు.. నటుడు, దర్శకుడు అయిన సునీల్ ఆనంద్ (70) చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన మేనకోడలు జీనా నారంగ్.. కుటుంబ సభ్యుల తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)

అమెరికా నుంచి భారత్‌కి తిరిగొస్తుండగా లండన్‌లో సునీల్ ఆనంద్‌కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల తర్వాత స్టెంట్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుండగా.. సర్జరీకి ముందే ఈయనకు మరోసారి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తుదిశ్వాస విడిచారు. గతంలో తండ్రి దేవ్ ఆనంద్ ఏ ఆస్పత్రిలో అయితే చనిపోయారో అదే చోట ఇప్పుడు కొడుకు సునీల్ ఆనంద్ కూడా మరణించారు.

1984లో తండ్రి దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' సినిమాతో సునీల్ ఆనంద్.. హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత 'కార్ థీఫ్', 'మైన్ తేరే లియే', 'మాస్టర్' తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. 

అయితే 2023లో తన తండ్రి 100వ జయంతి వేడుకల్లో మాట్లాడిన సునీల్ ఆనంద్.. నా జీవితంలో 40 ఏళ్లకు పైగా తండ్రి ఆరోగ్యం, షూటింగ్ షెడ్యూల్స్, కుటుంబ నిర్మాణ సంస్థ నవకేతన్ ఫిలిమ్స్ వ్యవహారాలని చూసుకున్నానని చెప్పారు. తన తండ్రి జీవితానికి అంకితమిచ్చేలా ఓ భారీ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఇప్పుడు సునీల్ ఆనంద్ తుదిశ్వాస విడిచారు.

(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)