Breaking News

హీరోయిన్‌తో డేటింగ్‌.. స్నేహితురాలితో పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన నటుడు

Published on Tue, 01/21/2025 - 17:14

ప్రముఖ బాలీవుడ్ నటుడు అడార్ జైన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్న నాటి స్నేహితురాలు అలేఖ అద్వానీని ఆయన పెళ్లాడారు. గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు,కుటుంబ సభ్యులు  సందడి చేశారు. వారం రోజు క్రితమే వీరి పెళ్లి వేడుక జరగగా.. తాజాగా నటుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా.. అడార్ జైన్ ప్రముఖ సీనియర్ నటుడు రాజ్‌ కపూర్‌ మనవడు. రాజ్‌ కపూర్ ‍కుమార్తె  రీమా కపూర్ కుమారుడు. వీరంతా బాలీవుడ్ సినీ తారలైన  రణ్‌ బీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్‌లకు బంధువులే. అయితే వీళ్లెవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. కానీ గత సంవత్సరం ముంబయిలోని ఆదర్ నివాసంలో జరిగిన రోకా వేడుకలో మాత్రం పాల్గొన్నారు. రోకా వేడుకకు అలియా భట్, నీతు కపూర్ కూడా హాజర‍య్యారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆదర్ జైన్‌- అలేఖా అద్వానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో మూడుముళ్లబంధంలోకి అడుగుపెట్టారు.

తారా సుతారియాలో డేటింగ్..

అంతతముందు అడార్ జైన్ కొన్నేళ్ల పాటు బాలీవుడ్ భామ తారా సుతారియాతో డేటింగ్‌లో ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరిద్దరు పలు ఈవెంట్లతో సందడి చేశారు. 2020లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2023లో  ఈ జంట విడిపోయారు. కాగా.. 2017లో ఖైదీ బ్యాండ్‌ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అడార్ జైన్.. చివరిసారిగా హలో చార్లీ చిత్రంలో కనిపించాడు.
 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)