Breaking News

బిడ్డకు జన్మనిచ్చిన 'బిగిల్‌​' సినిమా నటి

Published on Tue, 01/21/2025 - 09:37

కోలీవుడ్‌ ప్రముఖ లేడీ కమెడియన్ ఇంద్రజకు (Indraja) కుమారుడు జన్మించాడు. గతేడాదిలో తన స్నేహితుడు డైరెక్టర్‌ కార్తీక్‌తో ఆమె ఏడడుగులు వేసింది. ఇంద్రజ తండ్రి రోబో శంకర్‌(Robo Shankar) తమిళ్‌ చిత్ర సీమలో కమెడియన్‌గా రాణించారు.  రోబో డ్యాన్స్‌తో ఫేమస్‌ అయినందున శంకర్‌ కాస్తా రోబో శంకర్‌ అయ్యాడు. కోలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు.

నటి ఇంద్రజ తమిళ్‌తో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్‌' చిత్రంలోనూ హీరోయిన్‌ అదితి శంకర్‌ స్నేహితురాలి పాత్రలో యాక్ట్‌ చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. 

(ఇదీ చదవండి: దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్‌ ఆవేదన)

తమిళ్‌లో ప్రసారం అవుతున్న`మిస్టర్ అండ్ మిస్సిస్` షో చేస్తున్నప్పుడు ఇంద్రజ గర్భవతి అయింది. ఈ విషయం ఆమె చెబుతూ ఆ షో నుంచి మధ్యలోనే తప్పుకుంది. ఇప్పుడు ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని బంధువులు తెలుపుతున్నారు. మనవడు పుట్టడంతో రోబో శంకర్ కుటుంబం ఆనందంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

కార్తీక్‌ను దత్తత తీసుకున్న  రోబో శంకర్‌,ప్రియాంక దంపతులు
ఇంద్రజ పెళ్లి తర్వాత అందరూ తన మేనమామనే ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంద్రజ తల్లి ప్రియాంకకు కార్తీక్ సొంత సోదరుడు అని చాలామంది అనుకున్నారు. ఇంద్రజకు కార్తీక్ మేనమామ అవుతాడని  అనుకున్నారు. ఈ క్రమంలో కార్తీక్‌ మాట్లాడుతూ.. తాను ఇంద్రజకు మేనమామను కాదని గతంలో ఓ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. 

తనను సోదరుడిగా ప్రియాంక దత్తత తీసుకున్నారని కార్తీక్ వెల్లడించారు. తాను ఇంద్రజ అమ్మ ప్రియాంకకు సొంత తమ్ముడిని కాదు. రోబో శంకర్, ప్రియాంక  ఇద్దరూ చాలారోజులుగా తెలుసు. ప్రియాంకకు సోదరులు లేకపోవడంతో ఆమె తనను దత్తత తీసుకున్నారని ఆయన తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)