మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని అమ్మనాన్న ఏడ్చారు

Published on Fri, 08/14/2026 - 13:01

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ రేపటి(ఆగస్టు 15) నుంచి ప్రసారం కానుంది. ఈ పోటీలో 70 మంది సామాన్యులు పాల్గొనగా 15 మంది తుది పోటీ కోసం ఎంపికయ్యారు. వీళ్లలో మిగతా అందరికంటే సూర్యాపేట్‌కి చెందిన రైతు, సింగర్ ఝాన్సీని ప్రోమోల్లో ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన విషయాలని ఎమోషనల్‌గా చూపిస్తున్నారు. మరి ఈమె ఏం చెప్పింది? ఫైనల్-15కి సెలెక్ట్ అయిందా? లిస్టులో ఎవరెవరున్నారంటే?

(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్‌లో ఫొటోలు తీసుకోను: నాగ్)

ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కష్టాలు ఏముంటాయి? అని జ‍డ్జి నవదీప్ ఈమెని అడగ్గా.. 'పెట్టుబడి పెట్టందే పంట పండదు. చివరకొచ్చేసరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు. కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రకృతితోనే పోటీపడాలి. నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని మా అమ్మవాళ్లు ఏడ్చారు. ఈ రోజు నువ్వు కన్నది ఆడపిల్లని కాదు నలుగురికి స్పూర్తిగా ఉండే ఓ మగరాయుడు లాంటి బిడ్డని కన్నావ్ అని అంటున్నారు' అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.

ఇకపోతే అగ్నిపరీక్ష తుదిపోటీలకు ఎంపికైన వారిలో రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీళ్లలో నుంచి బిగ్ బాస్ 10వ సీజన్‌లోకి ఎవరు అడుగుపెడతారానేది షో మొదలయ్యే రెండు మూడు రోజుల ముందు తెలిసే అవకాశముంది.

వచ్చే నెలలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ కొత్త సీజన్ కోసం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలని టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆటో రాంప్రసాద్ దాదాపు ఖరారు కాగా యాదమ్మ రాజు, దీపిక రంగరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, ఆషిక, నూకరాజు, పల్లవి గౌడ లేదా పల్లవి రామిశెట్టి లాంటి టీవీ సెలబ్రిటీలు ఈసారి షోలోకి రానున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు)

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)