Breaking News

ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్‌.. అవినాష్‌ను ఆడుకున్న బిగ్‌బాస్‌

Published on Mon, 12/09/2024 - 23:32

నామినేషన్స్‌ అయిపోయాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్‌ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్‌లో గెలవకపోతే ప్రైజ్‌మనీ కట్‌ అవుతుందన్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్‌ 9) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

సీరియల్‌ పరివారం వర్సెస్‌ బీబీ పరివారం
సీరియల్‌ సెలబ్రిటీలు బిగ్‌బాస్‌ హౌస్‌కు వస్తారని చెప్పాడు బిగ్‌బాస్‌.  మా సీరియల్‌ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్‌మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్‌మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్‌ టీమ్‌ అర్జున్‌ కళ్యాణ్‌, అను హౌస్‌లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్‌కు రూ.12,489 ప్రైజ్‌మనీ నిర్ణయించారు. 

ఒగ్గుకథ చెప్పిన అవినాష్‌
ఈ ఆటలో సీరియల్‌ పరివారంతో నబీల్‌-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్‌మనీలో యాడ్‌ చేశారు. తర్వాత అవినాష్‌ టాప్‌ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్‌ యాక్షన్‌ రూమ్‌లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్‌బాస్‌ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్‌ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.

అవినాష్‌ను ఆటాడుకున్న బిగ్‌బాస్‌
దీంతో అవినాష్‌ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్‌బాస్‌ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్‌ వినిపించడంతో అవినాష్‌ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్‌మేట్స్‌ అందరూ ఘొల్లుమని నవ్వారు.

ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్‌
అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ టీమ్‌ నుంచి ప్రభాకర్‌, ఆమని వచ్చారు. తమ సీరియల్‌ స్టోరీలైన్‌ గురించి చెప్తూ హౌస్‌మేట్స్‌ను మీలో ఎవరు లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్‌.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్‌- ఆమనితో ప్రేరణ - అవినాష్‌ బాల్స్‌ గేమ్‌ ఆడారు. ఇందులో సీరియల్‌ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)