Breaking News

నిశ్చితార్థం చేసుకుని బిగ్‌బాస్ జంట సర్‌ప్రైజ్

Published on Mon, 09/01/2025 - 10:28

మరో బిగ్‌బాస్ జంట పెళ్లి చేసుకుంది. సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన.. బిగ్‌బాస్ 7వ తమిళ సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. అంతకు ముందు ఈమె.. తమిళ హిట్ సీరియల్ 'రాజా రాణి 2'తో ఆకట్టుకుంది. ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తనకు నిశ్చితార్థం అయిపోయినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

(ఇదీ చదవండి: పెళ్లి గురించి శుభవార్త చెప్పిన నారా రోహిత్‌)

సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అర్చన రవిచంద్రన్.. నటుడు అరుణ్ ప్రశాత్‌తో ప్రేమలో పడింది. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని మరోసారి బయటపెట్టారు. అప్పటినుంచి వీళ్ల పెళ్లి గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని శుభవార్త చెప్పకనే చెప్పారు.

అర్చన.. బిగ్‪‌బాస్ 7వ సీజన్ లో పాల్గొని విజేతగా నిలవగా, అరుణ్ ప్రశాత్‌ గతేడాది జరిగిన 8వ సీజన్ లో కంటెస్టెంట్‌గా వచ్చాడు. విజేత కాలేకపోయాడు. గత సీజన్‌లోనే ప్రియుడు కోసం అర్చన కూడా కాసేపు అలా వచ్చి వెళ్లింది. ప్రస్తుతానికి తమకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం బయటపెట్టడంతో సహ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో పెళ్లి తేదీ తదితర వివరాలు చెబుతారేమో!

(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)