Breaking News

'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. బిగ్‌ బాస్‌పై బిగ్‌ ట్విస్ట్‌!

Published on Sun, 08/10/2025 - 18:04

టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో తొమ్మిదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి రణరంగమే అంటూ నాగార్జున ఇప్పటికే అంచనాలు పెంచేశారు. కామన్ మ్యాన్‌ కేటగిరీలో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు. దాదాపుగా 40 మందిని ఫైనలైజ్‌ చేసిన వీరికి బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.

ఈ ప్రాసెస్ నడుస్తుండగానే బిగ్‌బాస్‌ మేకర్స్ మరో ప్రోమోను రిలీజ్ చేశారు. బిగ్‌ బాస్ కమింగ్ సూన్ అంటూ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్‌తో జరిగిన సరదా సంభాషణ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లడానికి వచ్చావా? అంటూ నాగార్జున అడగ్గా.. కాదు.. ఏలడానికి వచ్చాను అంటూ వెన్నెల కిశోర్ అంటారు. అది నీవల్ల కాదులే.. ఈసారి వెరీ టఫ్ అని నాగార్జున అనడంతో.. నేను చాలా రఫ్ అని చెప్తాడు.

(ఇది చదవండి: 40 మంది సామాన్యుల ఎంపిక.. హాట్‌స్టార్‌లో 'బిగ్‌బాస్‌' అగ్నిపరీక్ష)

ఈ సారీ బిగ్‌బాస్‌ డబుల్‌ హౌస్.. డబుల్ డోస్ అంటూ వెన్నెల కిశోర్‌కు నాగార్జున చిన్న ఝలక్ ఇస్తాడు. ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్‌ రాస్తావా? అంటూ వెన్నెల కిషోర్‌ను నాగార్జున ప్రశ్నిస్తాడు. నేను డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌తోనే మాట్లాడుకుంటానని వెన్నెల కిశోర్ చెప్పడంతో.. ఈసారీ ఏకంగా బిగ్‌బాస్‌నే మార్చేశా అంటూ మరో బిగ్‌ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. అందరి సరదాలు తీరిపోతాయి.. ఈ సారీ చదరంగం కాదు.. రణరంగమే.. అనే డైలాగ్‌లో ప్రోమో ముగిసింది. ఇది చూస్తుంటే ఈ బిగ్‌బాస్ సీజన్‌లో పాత బిగ్‌బాస్‌ ఉంటాడా? లేదా నిజంగానే కొత్త బాస్‌ను తీసుకొస్తున్నారా? మొత్తానికి ఈ ప్రోమోతో మరింత ఆసక్తి పెంచేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)