Breaking News

బిగ్‌బాస్‌లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్‌.. లైవ్‌లోనే గూగుల్‌పే..

Published on Thu, 06/19/2025 - 14:01

బిగ్‌బాస్‌ షోకు రెండుసార్లు వెళ్లొచ్చాడు గౌతమ్‌ కృష్ణ (Gautham Krishna). మొదటిసారి ఫినాలే వరకు చేరకుండానే ఎలిమినేట్‌ అయ్యాడు. రెండోసారి మాత్రం వైల్డ్‌ కార్డ్‌లా వెళ్లి వైల్డ్‌ ఫైర్‌ అయ్యాడు. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచాడు. అతడు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం సోలో బాయ్‌ (Solo Boy Movie). ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో గౌతమ్‌ తన బిగ్‌బాస్‌ సంపాదనను బయటపెట్టాడు. బిగ్‌బాస్‌ షోలో నేను పది వారాలున్నాను. అందుకుగానూ నేను రూ.30 లక్షలు సంపాదించాను. నా సంపాదనలో కొంత భాగం సమాజ సేవకు ఉపయోగించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకెప్పుడు వచ్చిందంటే.. 25 ఏళ్ల మురళీనాయక్‌ అనే వ్యక్తి ఆపరేషన్‌ సింధూర్‌లో దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు.

స్టేజీపై ఆర్థిక సాయం
మరి నేనేం చేశాను? అని ఆలోచించుకున్నాను. అందుకే సమవర్తి అనే ట్రస్ట్‌ ఏర్పాటు చేశాను. నా సంపాదనలో సగం ఈ ట్రస్టుకే ఇస్తాను. అలా బిగ్‌బాస్‌ ద్వారా సంపాదించినదాంట్లో సగం అంటే రూ.15 లక్షలు ఈ సంస్థ ఖాతాలో వేస్తున్నాను. మొదటగా మురళీ నాయక్‌ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను చచ్చేలోపు లక్ష మందికి సాయం చేయాలన్నదే నా కోరిక. నేను నా మాట నిలబెట్టుకోకపోతే నన్ను ఏకిపారేయండి అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే మురళీ నాయక్‌ కుటుంబానికి స్టేజీపై లక్ష రూపాయలు గూగుల్‌ పే చేశాడు. సోలోబాయ్‌ చిత్రం జూలై 4న విడుదల కానుంది.

చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)