Breaking News

ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిన బిగ్‌బాస్‌ విన్నర్‌.. షాక్‌లో అభిమానులు

Published on Sun, 03/06/2022 - 18:39

టెలివిజన్‌ నటి, మోడల్‌, హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ విజేత దివ్య అగర్వాల్‌ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ప్రియుడు వరుణ్‌ సూద్‌తో 4 ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో తన ఫోటోను షేర్‌ చేస్తూ ఆదివారం ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. 

‘జీవితం సర్కస్ లాంటిది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరి నుంచి ఏదీ ఆశించొద్దు. అదే నిజం. సెల్ఫ్‌ లవ్‌ తగ్గిపోవడం మొదలైనప్పుడు ఏమి జరుగుతుంది ? నా జీవితంలో జరుగుతున్న దేనికి నేను ఎవరినీ నిందించను. అదే మంచిది.  నా కోసం నేను బతకాలనుకుంటున్నాను.  నేను కోరుకున్న విధంగా సొంతంగా జీవించాడానికి సమయం వెచ్చించాలనుకుంటున్నాను అని అధికారికంగా ప్రకటిస్తున్నాను. 
చదవండి: ప్రభాస్‌ సినిమాకి టైటిల్‌ మారనుందా? త్వరలోనే అప్‌డేట్‌

ఒక నిర్ణయం తీసుకోడానికి పెద్ద పెద్ద కారణాలు, సాకులు అవసరం లేదు. దీని నుంచి బయటపడటానికి ఇది నేను తీసుకున్న నిర్ణయమే. తనతో గడిపిన క్షణాలన్నీ సంతోషకరమైనవే. అతను గొప్ప వ్యక్తి. తనెప్పుడూ నాకు మంచి స్నేహితుడే. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి.’ అంటూ ప్రియుడు వరుణ్‌తో బ్రేకప్‌ గురించి రాసుకొచ్చింది.

కాగా టెలివిజన్‌ సిరీస్‌ ఏస్ ఆఫ్ స్పేస్‌లో పాల్గొనడానికి ముందే వరుణ్, దివ్య స్నేహితులు. అక్కడి నుంచి వీరి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వరుణ్‌ దివ్యకు ప్రపోజ్ చేయడంతో వీరిద్దరి లవ్‌ ట్రాక్‌ ఆఫీషల్‌ అయ్యింది. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. అయితే  ఇలా అనుకోకుండా వరుణ్‌, దివ్య విడిపోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
చదవండి: చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)