Breaking News

నేను మద్యం, సిగరెట్లు తాగుతా.. బిగ్‌ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

Published on Wed, 08/02/2023 - 18:08

ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌-2 కొనసాగుతోంది. ఈ రియాల్టీ షోకు సల్మాన్ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రియాలిటీ షో జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ‍అయితే ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న  ఆషికా భాటియా గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మనీషా రాణితో పాటు ఆషికాను నామినేట్ చేయగా ఎలిమినేట్ అయింది ముద్దుగుమ్మ.  అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆషికా తన అలవాట్లపై సంచలన కామెంట్స్ చేసింది. తనకు సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉందని కుండబద్దలు కొట్టింది. ఈ విషయం మా అమ్మకు తెలుసని మరో బాంబు పేల్చింది. 

(ఇది చదవండి: బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!)
 
ఆషిక మాట్లాడుతూ.. 'నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ విషయం గురించి మా అమ్మకు తెలుసు. అందుకే నేను ఎవరి అభిప్రాయాలను పట్టించుకోను. మా అమ్మకు తెలిసినప్పుడు ఇతరుల మాటలను పట్టించుకోను. నేను ధూమపానం చేస్తాను.. కానీ ఈ విషయాన్ని మా అమ్మ వద్ద దాచలేదు. ప్రజలు అవసరమైన దానికంటే అనవసర విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.' అని చెప్పుకొచ్చింది. 

ఆషిక మాట్లాడుతూ.. 'నేను ఆరు నెలల క్రితమే ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ మానేశాను అని గతంలో కూడా చెప్పా. గతంలో వాటిని నేను ఎక్కువగా తాగేదాన్ని. అందుకే  స్మోకింగ్ అలవాటు గురించి అంతగా పట్టించుకోలేదు. స్మోకింగ్‌తో నాకు ఎలాంటి సమస్యలు లేవు.' అని అన్నారు. 

బిగ్‌ బాస్‌ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంపై ఆషికా స్పందించింది. ఎలిమినేట్ అయినందుకు నిరాశ చెందలేదు, కానీ నామినేషన్ ప్రక్రియ గురించి బాధపడ్డానని తెలిపింది. ఎందుకంటే కేవలం రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి.. ఇది అన్యాయమైనప్పటికీ.. ఇదంతా ఆటలో ఒక భాగం.. చివరికి ఎవరైనా వెళ్లిపోవాల్సిందే అన్నారు. ఈసారి నా వంతు వచ్చిందని ఆషికా తెలిపింది. 

(ఇది చదవండి: బాలీవుడ్‌ నాకు పొరుగు ఇల్లు లాంటిది: జేడీ చక్రవర్తి)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)