Breaking News

అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?

Published on Tue, 11/07/2023 - 18:56

ఉల్టా పుల్టాతో మొదలైన బిగ్‌ బాస్‌ రియాలిటీ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను ‍అలరిస్తోంది. 2.0 అంటూ సరికొత్త పంథాలో దూసుకెళ్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇప్పటి వరకు హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, వాదనలు మాత్రమే చూశాం. నామినేషన్స్ ప్రక్రియలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూశాం. కానీ వారి మనసుల్లో ఉండే భావోద్వేగాలను హౌస్‌లో చూడలేకపోయాం. కానీ ఈ వారంలో కంటెస్టెంట్స్‌ను ఏడిపించేస్తున్నారు బిగ్‌ బాస్. వారికి సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఫుల్‌ ఎమోషనల్‌గా మార్చేశారు. ఇవాళ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు చూస్తే ఆ విషయం అర్థమవుతోంది.

ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించి మూడు ప్రోమోలు రిలీజయ్యాయి. మొదటి ప్రోమోలో శివాజీని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్ బాస్.. రెండో ప్రోమోలో అంబటి అర్జున్‌ను ఏడిపించేశాడు. తాజాగా రిలీజైన మూడో ప్రోమోలో అశ్విని తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో వచ్చి రాగానే తన కూతురును హత్తకుని ఏడ్చేసింది. ఆ తర్వాత తన కూతురికి హౌస్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.

నా అన్న వాళ్లంతా.. నీవాళ్లు కాదంటూ అశ్వినికి ఆమె తల్లి సలహాలిచ్చింది. దీంతో హౌస్‌లోనే తల్లి ఒడిలో పడుకుని చిన్న పిల్లలా ఏడుస్తూ కంటతడి పెట్టుకుంది అశ్విని. 'నన్ను వదిలి వెళ్లకు మమ్మీ' అంటూ ఫుల్ ఎమోషనల్‌ అయింది. మొత్తానికి ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా కంటతడి పెట్టేలా బిగ్ బాస్ ఎమోషనల్ టచ్‌ ఇచ్చారు. ఈరోజు రిలీజైన మూడు ప్రోమోలు చూస్తే ఈ వారంలో హౌస్‌ ఫుల్ ఎమోషనల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)