Breaking News

నాకు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉండగా మా అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉంటే తప్పేంటి?

Published on Sat, 09/20/2025 - 10:11

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show)లో సెలబ్రిటీలు అడుగుపెట్టినప్పుడు వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ లాగుతుంటారు. కొన్నిసార్లు వాళ్లే గతాన్ని గుర్తు చేసుకుని పక్కవారితో చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. బాలీవుడ్‌ నటి, సింగర్‌ కునిక సదానంద్‌ అదే పని చేసింది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌లో పాల్గొంది. 

నాకింకా పెళ్లి కాలే
ఈమె కెరీర్‌ తొలినాళ్లలో సింగర్‌ కుమార్‌ సానును ప్రేమించింది. ఈ విషయాన్ని ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లో వెల్లడించింది. నేను సింగర్‌ (కుమార్‌ సాను)ని ప్రేమించాను. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. అతడు భార్యతో విడిపోయి ఉంటున్నాడు. దీంతో మేమిద్దరం కలిసుండేవాళ్లం. తనను ఎంతగానో నమ్మాను. కానీ ఓరోజు తనకు వేరే అమ్మాయితో ఎఫైర్‌ ఉందని తెలిసింది. 

తప్పేంటి?
ఆ విషయం అతడే ఒప్పుకోవడంతో తనకు బ్రేకప్‌ చెప్పాను అంది. తల్లికి యుక్తవయసులో ఉన్న రిలేషన్‌షిప్‌ గురించి కునిక కుమారుడు అయాన్‌ లాల్‌ స్పందిస్తూ.. నాకు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నప్పుడు అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉంటే తప్పేంటి? అప్పుడు తన వయసు 27 ఏళ్లే కదా! అప్పుడు నేనింకా పుట్టనేలేదు. కానీ, అమ్మ ప్రేమ విషయం నాకు తర్వాత తెలిసింది. 

27 ఏళ్ల వయసులో లవ్‌
అమ్మ అతడిని (కుమార్‌ సాను) సింగర్‌గా ఇష్టపడేది. ఇంట్లో అతడి పాటలు పాడుతూ ఉండేది. ఇప్పటికీ పాడుతుంది కూడా! అతడి ప్రతిభను ఇష్టపడుతుంది, కానీ ఆ వ్యక్తిని కాదు. వాళ్ల ప్రేమాయణం 27 ఏళ్లు సాగిందని అందరూ అనుకుంటారు, అది నిజం కాదు! అమ్మ 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమలో పడిందంతే! కొన్నేళ్లకే విడిపోయారు అని చెప్పుకొచ్చాడు.

రెండు పెళ్లిళ్లు- విడాకులు
కునికకు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఢిల్లీకి చెందిన అభయ్‌ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కొడుకు పుట్టాడు. తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 35 ఏళ్ల వయసులో వినయ్‌ లాల్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఓ కుమారుడు సంతానం. కానీ ఈ జంట కూడా ఎంతోకాలం కలిసుండలేదు, భేదాభిప్రాయాల వల్ల విడాకులు తీసుకున్నారు.

చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్‌గా రాము రాథోడ్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)