Breaking News

బిగ్‌బాస్ హౌస్‌కి తాళం.. గంటల్లోనే మూసేసిన అధికారులు

Published on Wed, 10/08/2025 - 12:41

తెలుగు, తమిళం, హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ షో ప్రసారమవుతోంది. కన్నడ సీజన్ మాత్రం మొదలైన పదిరోజులకే క్లోజ్ అయిపోయింది. ఏకంగా ప్రభుత్వ అధికారులు వచ్చి హౌస్‌కి మంగళవారం తాళం వేశారు. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి విషయం?

కన్నడ హీరో సుదీప్.. కన్నడ బిగ్‌బాస్ 12వ సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబరు 28న ఆదివారంతో షో మొదలైంది. బెంగళూరుకి దక్షిణాన ఉన్న జాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లో హౌస్ సెట్ వేశారు. అయితే హౌస్ నుంచి వచ్చే వ్యర్థాలని బయటకు వదిలేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే పర్యావరణ నియంత్రణ మండలి.. షో నిర్వహకులకు నోటీసులు జారీ చేసింది. వెంటనే బిగ్‌బాస్ ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డ్ కూడా ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖకు సూచించింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్)

ఇక మంగళవారం.. ప్రాంతీయ తహసీల్దార్ నేతృత్వంలో అధికారులు.. బిగ్‌బాస్ హౌస్ దగ్గరకు వెళ్లారు. తర్వాత పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. గంటలో అందరూ హౌస్‌ని ఖాళీ చేయాలని హెచ్చరించారు. అయినా సరే లోపలి నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో అధికారులు.. హౌస్‌కి తాళం వేశారు. ఇక చేసేదేం లేక రాత్రి 8 గంటల తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ నిర్వహకులు.. ఓ థియేటర్‌కి తరలించారు.

అయితే షో మొదలు కాకముందే పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ నిర్వహకులకు అవేం పట్టినట్లు లేవు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే షో ప్రారంభించారు. ఇప్పుడు మొదలైన 10 రోజుల్లో క్లోజ్ అయిపోయింది. మరి ఈ సీజన్‌ మళ్లీ మొదలవుతుందా లేదంటే ఇక్కడితే ఆపేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, రెండుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని అందుకే ఇలా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: Bigg Boss 9: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)