Breaking News

నర్సు నుంచి హీరోయిన్‌ రేంజ్‌కు.. పెళ్లి కబురు చెప్పిన బ్యూటీ

Published on Sat, 01/03/2026 - 07:10

మానవ జీవితంలో వివాహ బంధం చాలా ప్రవిత్రమైంది. అది అందంగా అమరడం ఒక వరం. పెళ్లి అనేది కొందరికి సరైన సమయంలో జరుగుతుంది. మరి కొందరికి కొంచెం ఆలస్యం కావొచ్చు. అయితే 99 శాతం మందికి జీవితం వివాహబంధంతో పరిపూర్ణం అవుతుంది. ఇకపోతే తమిళ నటి జూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. సుమారు ఏడేళ్ల క్రితం చెన్నై మెరినా బీచ్‌ వద్ద జరిగిన జల్లికట్టు పోరాటంలో గొంతు కలిపి జూలీ పాపులర్‌ అయింది. మొదట ఆమె ఒక సాధారణ నర్సు.. జల్లికట్టు ఉద్యమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో తమిళ బిగ్‌బాస్‌-1‌ షోలో ఛాన్స్‌ రావడం అలా మరింత గుర్తింపు పొందారు. 

బిగ్‌బాస్‌ నుంచి బయటకువచ్చిన తరువాత సినిమా రంగం ఆహ్వానం వచ్చింది.  అలా కొన్ని చిత్రాల్లో నటించిన జూలీ మోడలింగ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయ్యారు. ప్రముఖ మోడల్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ హీరోయిన్లను మించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి జూలీకి ఇప్పుడు కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లో, ప్రేమ వివాహమో తెలియదుగానీ, మహ్మద్‌ జక్రీమ్‌ అనే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. 

వీరిద్దరూ బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో కలిసి పాల్గొన్నారన్నది గమనార్హం. వీరి నిశ్చితార్థం వేడుక ఇటీవల జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. జూలీ, మహ్మద్‌ జాక్రీన్‌ల వివాహం ఈ నెల 16వ తేదీ ఉదయం చైన్నై, సెంథామస్‌లోని సెయింట్‌ పేట్రిక్‌ చర్చిలో జరగనుంది. అదే రోజు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుందని తెలిసింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)