Breaking News

ఖరీదైన లగ్జరీ కారు కొన్న బుల్లితెర నటుడు

Published on Sun, 02/05/2023 - 19:18

బిగ్‌బాస్‌ హిందీ 13వ సీజన్‌ కంటెస్టెంట్‌, బుల్లితెర నటుడు పరాస్‌ చాబ్రా గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. కొత్త కారు కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. కార్ల షోరూమ్‌కు వెళ్లిన పరాస్‌ మెర్సిడిస్‌ బెంజ్‌ కారు కొన్నాడు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి ఆ ఆనందకర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో పరాస్‌కు షోరూమ్‌ నిర్వాహకులు పుష్ప గుచ్ఛంతో ఆహ్వానం పలికారు. అనంతరం నటుడు తన కొత్త కారును ఓసారి నడపడంతోపాటు లోపల ఎలా ఉందో కూడా చూపించాడు. ఈ పోస్ట్‌ చూసిన ఫ్యాన్స్‌ పరాస్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపోతే ఈ కారు ధర రూ.50 లక్షల పైనే అని తెలుస్తోంది.

కాగా కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న పరాస్‌ ఇటీవలే దానినుంచి కోలుకున్నాడు. దీని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ప్రతిదానికి ఆందోళన చెందేవాడిని. దీనికోసం చికిత్స తీసుకుంటున్నా. చాలారోజుల తర్వాత మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాననిపిస్తోంది. నేను సంప్రదించిన డాక్టర్‌ నన్ను కోలుకునేలా చేశాడు. నా వృత్తిలో వరుసగా ఛాన్సులు రావు. కొన్నిసార్లు రెండు ప్రాజెక్టుల మధ్య గ్యాప్‌ వస్తుంటుంది. దీంతో నేను చాలా టెన్షన్‌ పడేవాడిని. కానీ చిత్రపరిశ్రమలో అలాంటివి సర్వసాధారణమని చెప్తూ తిరిగి నన్ను సాధారణ స్థితికి తీసుకొచ్చాడు' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: భార్యకు చిత్రహింసలు.. ఇంటివైపు కన్నెత్తి చూడని నటుడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)