మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఇనయా సుల్తానా
Published on Mon, 04/17/2023 - 18:30
బిగ్‌బాస్ సీజన్-6తో క్రేజ్ సంపాదించుకున్న ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆర్జీవీతో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే గుర్తింపుతో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఇనయా లేడీ లైగర్‌గా పేరు సంపాదించుకుంది. మొదట ఆర్జీవీ భామ అని నెగిటివ్‌గా వార్తలొచ్చినా తన ఆటతీరు, మాటతీరుతో మెప్పించింది.
అంతకుముందు అడపాదడపా చిత్రాల్లో మెరిసిన ఇనయా ఇప్పుడు హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. శివనాగు దర్శకత్వం వహిస్తున్న ‘నటరత్నాలు’ చిత్రంలో ఇనయా హీరోయిన్‌గా నటించనుంది. ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చందన ప్రొడక్షన్స్ పతాకంపై డా. దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.
Tags : 1