Breaking News

రోజుకు 22 గంటలు షూటింగ్‌లోనే.. నేలపై నిద్రపోయేవాడిని!

Published on Wed, 10/29/2025 - 15:38

కార్పొరేట్‌ ఆఫీసుల్లో ఎలాగైతే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగాలు చేస్తారో.. సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి టైమింగ్‌ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్‌ అంటే కష్టం.. అందులోనూ లెక్క లేకుండా రోజంతా ఎక్కువ గంటలు పని చేయించుకుంటామంటే కుదరదు, 8 గంటల షిఫ్టే ఉండాలి అని దీపికా పదుకొణె వంటి స్టార్‌ హీరోయిన్స్‌ కొత్త కండీషన్స్‌ పెడుతున్నారు.

సరిగా నిద్రుండేది కాదు
ఈ డిమాండ్లకు కొందరు నిర్మాతలు కుదరదని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. అయితే రోజుకు ఎనిమిది గంటలు కాదు, ఏకంగా 22 గంటలు పని చేసేవాడిని అని చెప్తున్నాడు హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, బుల్లితెర నటుడు హితేన్‌ తేజ్వాని (Hiten Tejwani). తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. కెరీర్‌ తొలినాళ్లలో నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. నెలలో 30 ఎక్స్‌ట్రా షిఫ్టులు చేసేవాడిని. నా చెక్‌ నేనే వెళ్లి తెచ్చుకునేవాడిని. రూ.1 లక్ష చెక్‌ అందుకోగానే సంబరపడిపోయేవాడిని.

ఛాన్స్‌ దొరికితే నేలపై నిద్ర
పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్‌ అనేవారు. తీరా అది ఉదయం ఐదింటివరకు సాగేది. రెండు గంటల గ్యాప్‌తో నెక్స్ట్‌ షిఫ్ట్‌ మొదలయ్యేది. అలా 22 గంటలు పనిచేసేవాడిని. మిగతా రెండుగంటలు నేలపై నిద్రించేవాడిని. నా టైమింగ్స్‌ నచ్చక చాలామంది డ్రైవర్స్‌ సడన్‌గా పని మానేసేవారు. దాంతో నేనే కారు నడిపేవాడిని, ఓసారైతే డివైడర్‌ను ఢీ కొట్టాను. నిజానికి వేరే ఉద్యోగం చూసుకుంటే పనిగంటలు తక్కువ ఉండేవి, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని చాలాసార్లు అనుకున్నాను. అయినా ఇష్టపడి, కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.

సీరియల్స్‌
హితేన్‌.. సుకన్య, ఘర్‌ ఏక్‌ మందిర్‌, కభీ సౌతన్‌ కభీ సహేలి సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసేవాడు. కుటుంబ్‌ సీరియల్‌తో బ్రేక్‌ అందుకున్నాడు. క్యూంకీ సాస్‌ భీ కభీ బహుతీ, కుసుమ్‌, బాలికా వధు, కసౌటీ జిందగీ కే వంటి పలు ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యూంకీ సాస్‌ భీ కభీ బహు తీ 2 సీరియల్‌ చేస్తున్నాడు. హిందీ బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు.

చదవండి: టాస్కుల్లో పవన్‌ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)