బిగ్‌బాస్ ‍ఫేమ్‌ హీరోగా సోలో బాయ్.. రిలీజ్ ఎప్పుడంటే?

Published on Wed, 06/04/2025 - 13:12

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'సోలో బాయ్'. ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై  సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.

వచ్చేనెల 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ హీరోగా అభిమానులను అలరించనున్నారు. ఇప్పటికే రిలీజైన  ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ కథ చాలా కొత్తగా అనిపించి, ఈ సినిమాను నిర్మించినట్లు డైరెక్టర్ నవీన్ అన్నారు. ఈ చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుందని తెలిపారు. కాగా.. గౌతమ్ కృష్ణ గతంలో ఆకాశవీధుల్లో అనే చిత్రంలో నటించారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పడిపోయానే సఖి అనే లిరికల్‌ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, డాక్టర్ భద్రం, అరుణ్ కుమార్‌, ఆర్కే మామ, షఫీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జుడా సంధి సంగీతమందించారు. 

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)