Breaking News

బిగ్‌బాస్‌తోనే ఫేమ్.. వరుణ్‌ తేజ్‌ పెళ్లి వార్తతో షాకయ్యా!

Published on Tue, 12/12/2023 - 14:43

బాలీవుడ్‌లో ముఖ్బీర్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన టాలీవుడ్ నటుడు అలీ రెజా. ఆ తర్వాత  'పసుపు కుంకుమ' సీరియల్‌తో బుల్లితెరపై కనిపించారు. 2014లో అమృతం చందమామలో సినిమా ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధృవ, మెట్రో కథలు, వైల్డ్ డాగ్, రంగమార్తాండ, గ్రే సినిమాల్లో నటించారు. అంతే కాకుండా 2019లో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్ని మరింత ఫేమస్ అయ్యారు. తాజాగా అవికా గోర్‌ నటించిన వధువు వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ రెజా తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. 

అలీ రెజా మాట్లాడుతూ.. 'నేను హోటల్‌లో ఉన్నప్పుడు మా పక్కనే మోడలింగ్‌ కంపెనీ ఉండేది. ఆ తర్వాత నాకు మోడలింగ్ వెళ్లమని కొందరు సలహా ఇచ్చారు. అలా నా జర్నీ మొదలైంది. నేను ఫేమస్ అవ్వడానికి 14 ఏళ్లు పట్టింది. నాకు పసుపు- కుంకుమ సీరియల్‌తో గుర్తింపు వచ్చింది. కానీ బిగ్‌బాస్‌ తర్వాతే ఎక్కువ ఫేమస్ అయ్యా. ఈ సీజన్‌లో ఎవరెవరు ఉన్నారో అని ఫస్ట్ ఎపిసోడ్ చూశా. ' అని అన్నారు.

డబ్బు సంపాదించాలనే కోరిక

 సినిమాల్లోకి రావడంపై మాట్లాడుతూ.. ' నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేసి బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంది. దీంతో పాటు యాక్టింగ్‌ చేయాలనే  పిచ్చి కూడా ఉండేది. అందుకే హోటల్‌ వ్యాపారం నుంచి తప్పుకున్నా. అయితే కరోనా తర్వాత ఇండస్ట్రీలో మార్పులొచ్చాయి. కానీ మా నాన్నకు రెస్టారెంట్స్‌ ఉండటం వల్ల నాకు మేలు జరిగింది. అప్పుడే సొంతంగా బిజినెస్ చేద్దామనే ఆలోచన వచ్చింది. నాకు ఇందులో అనుభవం కూడా ఉంది. ఆర్థికంగా బలంగా ఉండాలని ఫిక్స్ అయ్యా. అందుకే రీసెంట్‌గా ముంబైలో రెండు రెస్టారెంట్స్ ప్రారంభించానని' తెలిపారు. 

డబ్బుకోసమే ఆ పాత్ర ఒప్పుకున్నా

మెట్రో కథలు చిత్రం గురించి మాట్లాడుతూ.. 'చాలామంది మెట్రో కథల్లో చేసిన క్యారెక్టర్‌ను కొందరు బ్యాడ్‌గా రిసీవ్ చేసుకున్నారు. కానీ అందులో ఎక్కడా కూడా ఇంటీమసీ లేదు. అది మన ప్రస్తుత సమాజంలో జరుగుతున్నదే చూపించారు. నిజంగా నేను డబ్బుల కోసమే ఆ పాత్ర చేశా. కానీ అది ఒక మంచి మేసేజ్. చాలామంది యూట్యూబ్‌లో ఆ సీన్‌ను రాంగ్‌గా చూపించారు. సోషల్ మీడియాలో ఏం చేసినా నా కెరీర్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నేను వాటిని అసలు పట్టించుకోను. ప్రస్తుతం రిలీజైన వధువు వెబ్‌సిరీస్‌లో నందు అన్నతో చేయడం చాలా బాగా అనిపించింది. మా ఇద్దరి మధ్య స్నేహం ఇంకా బాగా పెరిగింది' అని అన్నారు. 

వరుణ్‌ తేజ్ పెళ్లిపై కామెంట్స్..

అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్‌ వాలైంటెన్‌లో చేస్తున్నట్లు తెలిపారు. మరో కొన్ని ప్రాజెక్టులు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయని అలీ రెజా వెల్లడించారు.  వరుణ్ తేజ్‌ పెళ్లి గురించి విన్నప్పుడు మాకు కూడా షాకింగ్‌గా అనిపించింది. అన్నతో పెళ్లికి ముందే కలిసి పనిచేశా.. సెట్స్‌లో కూడా ఎప్పుడు ఆ విషయం ఎప్పుడు చెప్పలేదని అన్నారు. వరుణ్ అన్న మంచి వ్యక్తి.. ఆయనతో పని చేయడం సంతోషంగా అనిపించిందని తెలిపారు. పెళ్లి తర్వాత కూడా వరుణ్‌ను కలిశానని వెల్లడించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)