Breaking News

పల్లవి ప్రశాంత్‌పై సందీప్ పాజిటివ్ కామెంట్స్.. అదే కారణమా?

Published on Mon, 10/30/2023 - 19:01

బిగ్‌బాస్ సీజన్-7 ఎనిమిదో వారం ముగిసింది. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా టాప్‌-5లో ఉంటాడని భావించిన ఆట సందీప్ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. ఈ వారం నామినేట్ అయినవారిలో శోభాశెట్టి, సందీప్‌కు తక్కువ ఓట్లు రాగా.. చివరికీ సందీప్‌ బయటకు రావాల్సి వచ్చింది. ఏడు వారాలుగా నామినేషన్స్‌లో లేని అతను బయటికి వస్తాడని ఎవరూ అనుకోలేదు. అయితే తాజాగా హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతను హౌస్‌లో వందశాతం గేమ్‌ బాగా ఆడుతున్నాడని ప్రశంసలు కురిపించారు. 

(ఇది చదవండి: ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్‌ .. ఎమోషనల్‌ అయిన జ్యోతిరాజ్‌)

సందీప్ మాట్లాడుతూ..'రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫేక్ హా, జెన్యూన్‌ అని నేను చెప్పలేను. తాను వందశాతం గేమ్ ఆడుతున్నాడు.  అతనితో పాటు అందరూ కూడా గట్టిగానే వందశాతం ఎఫర్ట్ చూపిస్తున్నారు. ఆడని వాళ్లు హౌస్‌లో చాలామంది ఉన్నారు. నేను అనుకోలేదు ఇలా బయటకొస్తానని. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో.. ఆడనివాళ్లు బయటకొస్తారని నేను అదే అనుకున్నా. అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నా. కానీ నా ఎలిమినేషన్ ఊహించలేదు. అమర్ లాస్ట్‌ టైమ్‌ నామినేషన్స్‌లో ప్రశాంత్ పట్ల మాట్లాడింది తప్పు. ఏదైతే ఆ పదం ఉందో 'ఈ నా కొడుకు' అన్నది తప్పు అన్న. దాన్ని నేను కూడా అంగీకరించను.' అంటూ ప్రశాంత్‌ పట్ల పాజిటివ్‌ కామెంట్స్ చేశారు. 

సందీప్ మాట్లాడుతూ..'ఇప్పటికీ హౌస్‌లో నా కన్నా తక్కువగా ఆడుతున్న వాళ్లు ఉన్నారు. రతిక రోజ్‌, భోలే షావలి ఆడిందేమీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే నా కన్నా ముందే భోలే వెళ్ల పోవచ్చని అనుకున్నా. హౌస్‌లో ఉన్నప్పుడు నా ఆటను నేను బాగానే ఆడా. ఒక గ్రూప్‌ అంటూ మమ్మల్ని వేరు చేయటం సరికాదు. పల్లవి ప్రశాంత్‌, ప్రియాంక, అమర్‌దీప్‌లు టాప్‌-3లో ఉంటారు' అని చెప్పుకొచ్చారు.

సోషల్ వార్

అయితే సందీప్‌ హౌస్‌లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసే విషయంలో ఇద్దరి మధ్య కాస్తా వాదన జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రశాంత్ సపోర్టర్స్‌కు, సందీప్‌ భార్య జ్యోతిరాజ్‌కు మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది. అదే సమయంలో సందీప్ భార్య జ్యోతిరాజ్‌ను ఓ వీడియోను రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. 

ఈ విషయాన్ని ఇటీవలే ఇంటర్వ్యూలోనూ జ్యోతిరాజ్ ప్రస్తావించింది. పల్లవి ప్రశాంత్‌ మద్దతుగా ఉండేవాళ్లే అతన్ని ఎలిమినేట్ అయ్యేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. బిగ్ బాస్‌ అనేది ఒక షో అని.. ఇందులో కుటుంబ సభ్యులను లాగడం మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చింది.  ఈ నేపథ్యంలో వీటన్నింటికీ ఫుల్ స్టాప్‌ పెట్టేందుకే సందీప్ అలా మాట్లాడి ఉంటారని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్.. సందీప్‌ ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ వార్‌కు ఎండ్‌ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. 

(ఇది చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)