భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
ప్రియురాలిని పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Published on Sun, 03/29/2026 - 18:32
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో విరోష్ జంటతో అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు. మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ రజత్ దలాల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలిని ఆయన పెళ్లాడారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పేరు తెచ్చుకున్న పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.
రజత్ దలాల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు..పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. బిగ్‌బాస్-18 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ది 50 అనే రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.
Tags : 1