Breaking News

'లగ్జరీ కారు వదిలేశా.. ఆ లైఫ్ స్టైల్‌ నుంచి పూర్తిగా బయటికొచ్చా'

Published on Fri, 01/23/2026 - 22:22

బిగ్‌బాస్ రియాలిటీ షో మరింత ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్‌ అమర్‌దీప్‌ చౌదరి. తన అగ్రెసివ్‌ మాటలతో హౌస్‌లో తన ఆటతో మెప్పించాడు. బుల్లితెరపై అలరించిన అమర్‌దీప్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా చేస్తోన్న చిత్రం సుమతి శతకం. ఈ సినిమాతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో సైలీ చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమర్‌ దీప్‌ చౌదరి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. టీవీ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చి సినిమాలు చేద్దామని ఎప్పటి నుంచో ఉందని అన్నారు. తన లైఫ్‌ స్టైల్‌ను మార్చుకుని బతకాల్సి వచ్చిందని తెలిపారు. అన్ని లగ్జరీ వసతులు ఉన్న కారును వదిలిపెట్టి.. నార్మల్ కారు వాడుతున్నానని అమర్ దీప్‌ వెల్లడించారు. కానీ ఏదో ఒక రోజు మళ్లీ ఆ రోజు వస్తుందని అన్నారు.

తనకు హీరో రవితేజ అంటే చాలా ఇష్టమని అమర్‌దీప్ అన్నారు. ఆయనకు తాను అభిమానినని.. ఇండస్ట్రీలో తనకు ఆదర్శమని తెలిపారు. ఆయనే నాకు గురువు.. రవితేజను చూసే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని వెల్లడించారు. సింధూరం సినిమాలో రవి తేజలో కనిపించిన ఆ స్పార్క్‌ను నేను పట్టుకుని.. అదే స్పార్క్‌ను ఈ సినిమాలో చూపించానని అమర్ దీప్‌ తెలిపారు. 

 

 

Videos

Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..

Perni Nani: జగన్ ట్రెండ్ సెట్టర్.. మీరు ఫాలోవర్స్..

GVMC ఉద్యోగి భౌతికకాయానికి YSRCP నేతల నివాళులు

ఉదయగిరిలో మగ పెద్ద పులి జాగ్రత్త..అటవీశాఖ హెచ్చరిక

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని

RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

Chandrasekhar : సచివాలయం ఉద్యోగులను చంపేస్తున్నారు.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావ్

Kakinada : ఈ ప్రభుత్వానికి ఓటు వేసి నరకం చూస్తున్నాం..

Photos

+5

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్‌ డే పార్టీలో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

Anchor Suma : అందం పెరుగుతోంది కానీ తగ్గట్లేదు (ఫోటోలు)

+5

లుక్‌ టెస్ట్‌ అంటూ ఫోటోలు వదిలిన శివాత్మిక రాజశేఖర్‌

+5

సుకుమార్ కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

జిమ్‌లో కష్టపడుతున్న అనసూయ (ఫోటోలు)

+5

ఆర్సీబీ క్వీన్స్‌.. అదిరిపోయే లుక్స్‌.. స్మృతి స్పెషల్‌ (ఫొటోలు)

+5

కళ్లతో మాయ చేస్తూ.. అనుపమ గ్లామర్ షో (ఫొటోలు)

+5

మంచు ముద్దలలో మునిగిన లోయ (ఫొటోలు)

+5

ఇది అంతులేని కథలా.. సిట్‌ విచారణ వేళ కేటీఆర్‌ (చిత్రాలు)