Breaking News

ఛాలెంజ్‌ చేసిన పవన్‌ను ఓడించిన భరణి

Published on Thu, 12/04/2025 - 07:52

టికెట్‌ టు ఫినాలే కోసం హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. తనూజ.. సుమన్‌ను ప్రత్యర్థిగా ఎంచుకోవడంతో మొన్నటి ఎపిసోడ్‌ ముగిసింది. మరి తర్వాతేం జరిగింది? ఎవరు గెలిచారు? మళ్లీ ఎలాంటి గేమ్స్‌ పెట్టారనేది బుధవారం (డిసెంబర్‌ 3వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం...

సుమన్‌ చేతిలో ఓటమి
తనూజ, సుమన్‌కు బిగ్‌బాస్‌ వాటర్‌ ట్యాంక్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో కల్యాణ్‌, రీతూ, ఇమ్మాన్యుయేల్‌.. తనూజకు సపోర్ట్‌ చేశారు. భరణి, పవన్‌.. సుమన్‌కు మద్దతిచ్చారు. ట్యాంకు సగానికి పైగా నిండినా సరే సుమన్‌ కదలకుండా శిలావిగ్రహంలా నిల్చుని గెలిచాడు. టికెట్‌ టు ఫినాలే రేసు నుంచి అవుట్‌ అయిపోవడంతో తనూజ ఏడ్చేసింది.

గెలిచిన పవన్‌
తర్వాత బిగ్‌బాస్‌ ఇచ్చిన పవర్‌ బాక్స్‌ అనే ఛాలెంజ్‌ను కల్యాణ్‌, పవన్‌, సుమన్‌ ఆడారు. ఈ గేమ్‌లో పవన్‌ గెలిచి భరణిని ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. అలా వీరిద్దరికీ వారధి కట్టు- విజయం పట్టు అనే బ్రిడ్జి టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పవన్‌పై భరణి గెలిచేశాడు. దీంతో పవన్‌ టికెట్‌ టు ఫినాలే రేసులో లేకుండా పోయాడు. 

మాట నిలబెట్టుకోలేని పవన్‌
ఈసారి ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యేది నేనే అని ఛాలెంజ్‌ చేసిన పవన్‌ ఆ మాట నిలబెట్టుకోలేకపోయేసరికి బాధపడ్డాడు. ప్రస్తుతానికి రీతూ, భరణి, కల్యాణ్‌,  ఇమ్మాన్యుయేల్‌, సుమన్‌ టికెట్‌ టు ఫినాలే రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అవుతారో చూడాలి!

Videos

YS Jagan: బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది

India Tour : పాలెం ఎయిర్ పోర్టులో పుతిన్ ల్యాండింగ్

ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!

Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ

YSRCP నేతపై టీడీపీ దాడి రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్

కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు

CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!

ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు

Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు

ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ

Photos

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?

+5

'అఖండ 2 తాండవం' హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

పిక్నిక్‌ వెళ్లిన ద ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌! (ఫోటోలు)

+5

ద్వారకాతిరుమల అనివేటి మండపంలో శిల్పకళా వైభవం (ఫొటోలు)

+5

చైతు-శోభిత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ప్రత్యేక ఫోటోలు