Breaking News

గేమ్‌ నీ చేతుల్లోకి తీసుకున్నావ్‌.. డ్రామా క్వీన్‌!

Published on Fri, 12/19/2025 - 16:00

పెళ్లి చేసుకునే వయసొచ్చినా సరే అమ్మానాన్నను వదిలేసి ఉండాలంటేనే ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. కానీ సంజనా మాత్రం గుండె రాయి చేసుకుని పిల్లాడిని, చంటిబిడ్డను వదిలేసి వచ్చింది. తన గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందే! ఏ రోజు కూడా పిల్లల పేర్లు ఎత్తి సింపతీ కోసం ప్రయత్నించలేదు. ఈ విషయంలో ఆమెను కచ్చితంగా ప్రశంసించాల్సిందే! నేడు ఆమె జర్నీ వీడియో చూపించనున్నాడు బిగ్‌బాస్‌. 

అరగంటలో వస్తానని..
ఈ మేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో సంజనా.. తన కొడుకు ఫోటో చూసి ఏడ్చేసింది. మమ్మీ ఇంట్లో లేనందుకు సారీ.. అరగంటలో వస్తానని చెప్పి 100 రోజులైనా ఇంటికి రాలేదు.. సారీ అని కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. టాప్‌ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్‌ 5 వరకు చేరిన ప్రయాణంలో.. మీలో ఉన్నంత డ్రామా ఉంది. సీజన్‌ 9 మొదటి కెప్టెన్‌గా గెలిచి ప్రారంభం నుంచే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు.

తనకంటూ ఓ మార్క్‌
ఇంట్లో ఏది జరిగినా అది మీవల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు (ఇమ్మాన్యుయేల్‌)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? టాస్కుల్లో మీరు పోటీపడినా.. సంచాలకులుగా ఉన్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు.

మొండిధైర్యం
ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని చూసి ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు అని చెప్పాడు. సీజన్‌పై ఆసక్తి క్రియేట్‌ చేసిందే సంజనా మరి! తనకు ఆ మాత్రం ఎలివేషన్‌ ఇవ్వాల్సిందే!

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)