Breaking News

రీతూ గుండె ముక్కలు చేసిన పవన్‌.. ఊహించని నామినేషన్స్‌

Published on Mon, 11/17/2025 - 11:42

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో రెండు ఊహించనివి జరగబోతున్నాయి. పదివారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న ఇమ్మాన్యుయేల్‌.. ఎట్టకేలకు పదకొండోవారం నామినేషన్స్‌లోకి వచ్చేశాడు. ఇక ఫ్రెండ్స్‌కు ఎక్కువ, ప్రేమికులకు తక్కువ అన్నట్లుగా ఉండే పవన్‌-రీతూల మధ్య పెద్ద అగాధం ఏర్పడనుంది. కారణం.. పవన్‌ రీతూని నామినేట్‌ చేశాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

నీకు కాన్ఫిడెన్స్‌ లేదు
రీతూ.. గేమ్‌లో వెనకబడిపోయింది. తనకు కాన్ఫిడెంట్‌ లేదు అని ఇమ్మాన్యుయేల్‌ నామినేట్‌ చేశాడు. కాన్ఫిడెన్స్‌ లేనిది నీకంటూ తిరిగి వాదించింది రీతూ. ఇమ్మూ.. భరణి ఆటలో పూర్తిగా ఎఫర్ట్స్‌ పెట్టడం లేదన్నాడు. నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే ఇంతకుముందులా ఆడలగలవా? పర్ఫామెన్స్‌ అంటే కేవలం టాస్కులే కాదు. ప్రతి టాస్క్‌ నాకు సాధ్యమైనంతవరకు ఆడుతున్నా అని వివరణ ఇచ్చాడు.

ఏడిపించేసిన పవన్‌
ఇక పవన్‌ (Demon Pavan).. రీతూని నామినేట్‌ చేశాడు. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్లుగా బయటకు వెళ్తుంది. అది బాధగా ఉంది. ప్రతిసారి నీది తప్పు లేదని స్టాండ్‌ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ, నాపై నమ్మకం లేదంటూ హర్ట్‌ చేశావ్‌. ప్రతిసారి నీ మంచే కోరుకున్నా.. అంటూ కన్నీళ్లు దిగమింగుతూ పాయింట్లు చెప్పాడు.

మౌనంగా రీతూ
తనకు ఎదురొచ్చే ఎవరి నోరైనా మూయించే రీతూ (Rithu Chowdary).. ఈసారి మాత్రం మూగబోయింది. అందరికంటే ఎక్కువ ఇష్టపడే పవన్‌ తనను నామినేట్‌ చేస్తుంటే తట్టుకోలేక కన్నీళ్ల రూపంలో తన బాధను వ్యక్తపరిచింది. నామినేషన్స్‌ అయ్యాక నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా.. అని రెండు చేతులతో తల బాదుకుంది. ఎందుకరుస్తున్నావని పవన్‌ అడిగితే నా వల్ల కావడం లేదంది. 

నామినేషన్స్‌లో ఆరుగురు
అందుకు పవన్‌ కూడా.. నావల్ల కూడా కావడం లేదని అరిచి వెళ్లిపోయాడు. మొత్తానికి ప్రోమో అయితే రీతూ-పవన్‌ ఫ్యాన్స్‌ను హర్ట్‌ చేసేలాగే ఉంది. ఇకపోతే సంజన, రీతూ, దివ్య, డిమాన్‌, కల్యాణ్‌, ఇమ్మూ, భరణి నామినేషన్స్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తనూజ కెప్టెన్సీ పవర్‌తో రీతూని సేవ్‌ చేసినట్లు భోగట్టా!

 

చదవండి: నన్ను బ్యాడ్‌ చేయొద్దు.. ఇమ్మూపై గరమైన తనూజ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)