Breaking News

Bigg Boss: బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, ముగింపు ముదుర్స్

Published on Mon, 12/22/2025 - 11:40

బిగ్ బాస్ దాదాపు 9ఏళ్ళ క్రితం తెలుగులో అడుగుపెట్టిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్ మా ఛానల్ రేటింగ్స్ ను ఆకాశానికి ఎత్తేసింది ఈ కార్యక్రమం. బిగ్ బాస్ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఆ క్రేజ్ ఎలా వచ్చిందంటే దాని చుట్టూ వచ్చే వివాదాలే ముఖ్యకారణం. వివాదం లేని సీజన్ ఇప్పటిదాకా జరగలేదు. తాజాగా ఈ బిగ్ బాస్ 9వ సీజన్ పూర్తి చేసుకుంది. మరి ఈ సీజన్ ఎలా గడిచిందో ఈ బిగ్ రివ్యూ లో చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu ) ఆరంభం అదుర్స్ ముగింపు ముదుర్స్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 7 న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో 22మంది కంటెస్టెంట్లతో మూడు నెలలకు పైగా ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ నటులు నాగార్జున ముందు చేసిన 6 సీజన్లతో పాటు ఈ సీజన్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో షోకు ఆయువుపట్టుగా మారారు. ఈసారి హౌస్ లోకి సెలబ్రిటీ స్టేటస్ లేని వాళ్ళను 7 మందిని పంపడం విశేషం. అందులోనూ సెలబ్రిటీ కాని వ్యక్తి అయిన కళ్యాణ్ పడాల ట్రోఫీ కూడా గెలుచుకోవడం మరో విశేషం. మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య మసాలాలు కాస్త మోతాదుకు మించి జరిగాయని చెప్పవచ్చు.

అంతేకాదు అభ్యంతరకర పదజాలంతో సీజన్ లోని ఒకటి రెండు ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్లు విపరీత ధోరణి తో మితిమీరి పోయారు. అయితే ఇప్పటి ఓటిటి కాలం ప్రేక్షకులకు ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ల బాండింగులకు కొదవే లేదు. దాదాపుగా కుటుంబంలో ఎన్ని బంధాలైతే ఉంటాయో అంతకన్నా ఎక్కువే హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య భారీగానే నడిచాయి. వాటిలో తనూజ, దివ్య, భరణి మధ్య నడిచిన బంధంతో పాటు డెమోన్ పవన్, రీతూ మధ్య నడిచిన ప్రేమాయణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సీజన్ లో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే ఎప్పూడూ తన గంభీర వదనంతో సుపరిచితుడైన బిగ్ బాస్  ఎన్నడూ లేని విధంగా తన కంటెస్టెంట్ లో ఒకరిని హౌస్ లో ఉండమని వేడుకోవడం.

సంజన విషయంలో జరిగిన ఈ ఘటన సీజన్ కే హైలైట్ గా నిలిచింది. ఘనంగా ప్రారంభించిన ఈ సీజన్ పేలవంగా ముగించారు. మామూలుగా ప్రతి సీజన్ ముగింపు దశలో చూపే హడావిడి ఈ సీజన్ లో బాగా తగ్గిందని చెప్పవచ్చు. ప్రతి సీజన్ ఆఖర్లో బయటకు వెళ్ళిన కంటెస్టెంట్లను హౌస్ లోకి ఆఖరున పిలిచి పండుగ కోలాహలంతో నింపేవారు. కాని ఈ సీజన్ లో ఆ ఊసే లేదు. అంతేకాకుండా ఫినాలే కప్పును పెద్ద సెలబ్రిటీతో విన్నర్ కు ప్రెజెంట్ చేసే ఆనవాయితీని కూడా ఈ సారి టీం పక్కన పెట్టేసింది. సెలబ్రిటీలు ఈ సారి దొరకలేదో ఏమో కాని ఫినాలేలో రోబోలతో కూడా ఒక ఎలిమినేషన్ అనౌన్స్ చేయించారు. ఏది ఏమైనప్పటికీ  ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం అదుర్స్ ముగింపు ముదుర్స్.
- హరికృష్ణ ఇంటూరు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)