Breaking News

ఫ్లోరా ఎలిమినేషన్‌ ఫిక్స్‌? బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అయినట్లేనా!

Published on Sat, 10/11/2025 - 15:37

ఫ్లోరా సైనీ (Flora Saini).. ఈపాటికే ఎలిమినేట్‌ అవ్వాల్సిన కంటెస్టెంట్‌! అలా అని తనపై జనాల్లో అంత వ్యతిరేకత ఉందా? అంటే రవ్వంతైనా లేదు. కానీ, తనపై పాజిటివిటీ కూడా లేదు. హౌస్‌లో ఎటువంటి ఇంపాక్ట్‌ చూపించకపోవడమే ఫ్లోరాకు పెద్ద మైనస్‌. అయితే కామనర్స్‌ చేసిన ఓవరాక్షన్‌ వల్ల ఫ్లోరాకు ఓట్లు పడ్డాయి. తనను లేటుగానైనా పంపించొచ్చు, ముందు తలనొప్పిగా తయారైన కంటెస్టెంట్లను తరిమేద్దాం అన్న ఉద్దేశంతో మనీష్‌, ప్రియ, హరీశ్‌లను బయటకు తోసేశారు.

స్కెచ్‌ వర్కవుట్‌ అయినట్లేనా?
కానీ, తన వల్ల షోకి ఎటువంటి ప్లస్‌ లేకపోయేసరికి బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9).. ఫ్లోరా ఎలిమినేషన్‌కు పెద్ద స్కెచ్‌ వేశాడు. తనను రెండువారాలు డైరెక్ట్‌గా నామినేట్‌ చేశాడు. పైగా ఈవారం వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లు వచ్చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురిని హౌస్‌లో దింపుతున్నారు. కాబట్టి తనతో పనేం లేనందున ఫ్లోరాను హౌస్‌ నుంచి సాగనంపుతున్నారు.

ఫ్లోరా ఏం చేసింది?
ఫ్లోరా సైలెంట్‌గా తన పని తను చేసుకుంటూ పోతుంది. తిన్నామా, పడుకున్నామా, గేమ్స్‌ ఆడామా.. అంతే! అంతకుమించి ఎటువంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడం లేదు. సంచాలక్‌గా ఉన్నప్పుడైతే తప్పుల మీద తప్పులు చేస్తోంది. ఎవరైనా తనను నామినేట్‌ చేసినా, ప్రశ్నించినా సైలెంట్‌గా ఉంటుందే తప్ప తిరిగి కౌంటర్లివ్వడం చాలా అరుదు. ఇలాంటి సైలెంట్‌ కంటెస్టెంట్‌ జనాలకు అంతగా నచ్చరు. అందుకే లక్స్‌ పాప ఈ వారం బయటకు వచ్చేస్తోందన్నమాట!

చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్‌: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)