Breaking News

పవన్‌ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్‌ చేసుకోమన్న ఫ్లోరా

Published on Sun, 10/12/2025 - 19:30

బిగ్‌బాస్‌ తెలుగు తొమ్మిదో సీజన్‌ (Bigg Boss Telugu 9)లో ఐదోవారం నామినేషన్స్‌ పూర్తవగానే ఎలిమినేట్‌ అయ్యేదెవరనేది ఫిక్స్‌ అయిపోయింది. కానీ రీతూ, ఫ్లోరా డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు కాసేపు సస్పెన్స్‌ క్రియేట్‌ చేశాడు నాగ్‌. హౌస్‌లో ఉంచినా సరే, పంపించినా సరే అన్నట్లుగా ఫ్లోరా చాలా కూల్‌గా ఉంది. కానీ, రీతూ మాత్రం ఏడుపందుకుంది. ఇద్దరినీ యాక్టివిటీ రూమ్‌కు పిలిచిన నాగ్‌.. చివరిసారి మీ మనసులోని మాటలు చెప్పమన్నాడు.

ఆ విషయం సంజనాకు మాత్రమే తెలుసు
అప్పుడు ఫ్లోరా (Flora Saini) మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో లైట్స్‌ ఆఫ్‌ అయిన తర్వాత నేను నా బెడ్‌పై చాలాసార్లు ఏడ్చాను. ఆ విషయం సంజనా ఒక్కరికే తెలుసు. తను మాత్రమే నా దగ్గరకు వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు కూడా సంజనా ఒక్కరే వచ్చింది. సంజనాను నేను మిస్‌ అవుతాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ గేమ్‌ ఎంజాయ్‌ చేయ్‌ అంటూ కాస్త ఎమోషనలైంది. రీతూ వంతు రాగా ఏడుస్తూనే మాట్లాడింది.

వెళ్లి పవన్‌ను హగ్‌ చేసుకో..
పవన్‌, నిన్ను చాలా మిస్‌ అవుతా.. నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు. బాగా ఆడు.. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏకధాటిగా ఏడ్చేసింది. తర్వాత నాగ్‌.. ఫ్లోరా ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. అప్పటికీ రీతూ ఏడుపు ఆపకపోయేసరికి ఫ్లోరా.. నువ్వు సేఫ్‌ అయ్యావ్‌, ఎందుకేడుస్తున్నావ్‌.. హ్యాపీగా వెళ్లు, పవన్‌ను హగ్‌ చేసుకో అని చెప్పింది. సంజన, ఇమ్మాన్యుయేల్‌, దివ్య, శ్రీజలకు థంబ్స్‌ అప్‌ ఇచ్చి తనూజ, భరణికి థంబ్స్‌ డౌన్‌ సింబల్‌ ఇచ్చింది. సుమన్‌ శెట్టి.. థంబ్స్‌ అప్‌, థంబ్స్‌ డౌన్‌కు మధ్యలో ఉన్నాడంది. అందరికీ గుడ్‌బై చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)