Breaking News

సూట్‌కేస్‌ తీసుకున్న పవన్‌.. మొత్తం ఎంత వెనకేశాడంటే?

Published on Sun, 12/21/2025 - 21:49

బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు, కాదు తనంతట తానే తలెత్తుకుని బయటకు వచ్చాడు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టినప్పుడు అసలు ఇతడికి ఎలా అవకాశమిచ్చారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తన ఎంపిక ఏదో అల్లాటప్పా కాదని పవన్ నిరూపించాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. 

సూట్‌కేస్‌తో బయటకు
రెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ఏకంగా టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. తెలివిగా మాస్‌ మహారాజ రవితేజ ఆఫర్‌ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్‌ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్‌ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్‌.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. మీ విల్ పవర్, ఫిట్‌నెస్ మాత్రమే కాదు, గెలుపు కోసం చివరివరకూ పోరాడే తత్వం మిమ్మల్ని నిజమైన యోధుడిగా మార్చేశాయి. 

ముందు తొక్కేసి తర్వాత పొగడ్తలు
కామనర్‌గా అడుగుపెట్టిన పవన్ యోధుడిగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనకున్న డీమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. ఓ దశలో రీతూతో బంధం కారణంగా డీమాన్ ఆటతీరుపై చాలానే విమర్శలు వచ్చాయి. 

టాస్కుల బాహుబలి
కానీ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. రీతూ ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోయిన తర్వాత డీమాన్ అసలు గేమ్ బయటపడింది. పంచ్‌లేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో బాహుబలిలా ఆడటం, గేమ్‌పై ఫుల్ ఫోకస్ లాంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ స్పీడ్ ముందు నుంచి ఉండుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవాడే అని కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా సెకండ్‌ రన్నరప్‌గా బయటకు వచ్చాడు.

సంపాదన ఎంతంటే?
ఇతడి రెమ్యునరేషన్‌ విషయానికి వస్తే.. కామనర్స్ అందరికీ ఒకే పారితోషికం ఇచ్చారు. అలా డీమాన్‌కి కూడా వారానికి రూ.70 వేల పారితోషికం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఓవరాల్‌గా 15 వారాలకుగానూ రూ.10.50 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.15 లక్షలు తోడవడంతో మొత్తం రూ.25 లక్షలకు పైగా సంపాదించాడు. మొత్తానికి పవన్‌కు ఈ షోతో డబ్బుకు డబ్బు, పేరుకు తగ్గ గుర్తింపు వచ్చింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)