Breaking News

నొప్పితో విలవిల్లాడిన పవన్‌.. రీతూ, కల్యాణ్‌ కన్నీళ్లు

Published on Sat, 11/29/2025 - 07:40

చివరి కెప్టెన్సీని హౌస్‌మేట్స్‌ చేతిలోనే పెట్టాడు బిగ్‌బాస్‌. కెప్టెన్సీ కంటెండర్స్‌ కోసం ఇతర ఇంటిసభ్యులు గేమ్‌ ఆడాలన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్లగా చివరికి పవన్‌, కల్యాణ్‌ మిగిలారు. ఈ ఇద్దరూ ఆడిన ఆటలో కల్యాణ్‌ గెలిచి కెప్టెన్‌ అయ్యాడు. ఆ ప్రక్రియ ఎలా జరిగిందో శుక్రవారం (నవంబర్‌ 28వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

హౌస్‌మేట్స్‌ చేతిలో పవర్‌
తనూజ, సుమన్‌, భరణిలలో ముందుగా డాగర్‌ అందుకున్నవారు కంటెండర్స్‌లో ఒకరిని సపోర్ట్‌ చేయవచ్చు. వీళ్లు ఎవరికైతే డాగర్‌ ఇస్తారో... ఆ వ్యక్తి మరో కంటెండర్‌ను రేసు నుంచి తీసేస్తారు. అలా సంజనా, దివ్య, ఇమ్మాన్యుయేల్‌, రీతూ వరుసగా అవుట్‌ అయ్యారు. చివరకు పవన్‌, కల్యాణ్‌ మాత్రం మిగిలారు.

పవన్‌ వర్సెస్‌ కల్యాణ్‌
వీరికి కంకర ఇచ్చి రోడ్డు వేసే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ గేమ్‌లో పవన్‌, కల్యాణ్‌ ఇద్దరూ చాలా బాగా ఆడారు. కల్యాణ్‌కు అందరూ సపోర్ట్‌ చేస్తుంటే.. పవన్‌కు రీతూ ఒక్కతే సపోర్ట్‌ చేసింది. అయితే పవన్‌ వెన్ను నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ నొప్పికి ఏడుపొక్కటే తక్కువ అంటూనే కష్టపడ్డాడు. 

ఏడ్చేసిన పవన్‌
అతడి నొప్పి చూసి రీతూ (Rithu Chowdary), కల్యాణ్‌ ఏడ్చేశారు. గేమ్‌ అయిపోగానే అతడు మెడికల్‌ రూమ్‌కు వెళ్లివచ్చాడు. నొప్పి వల్ల ఆడలేకపోయా.. మా మమ్మీడాడీ కూడా బాధపడి ఉంటారు అని పవన్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, అంతలోనే.. పోనీలే, మనోడు కెప్టెన్‌ అయ్యాడు అని సంతోషించాడు. బిగ్‌బాస్‌ 9లో చివరి కెప్టెన్‌గా కల్యాణ్‌ జెండా ఎగరేశాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)