Breaking News

కుటుంబంతో రాము రాథోడ్‌.. క్షమాపణలు చెబుతూ వీడియో

Published on Wed, 11/12/2025 - 13:27

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్‌ రాము రాథోడ్‌  సెల్ఫ్‌ ఎలిమినేట్‌తో  బయటకొచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. అయితే, తన అభిమానలు మాత్రం కాస్త నిరాశ చెందారు. సుమారు 60రోజుల పాటు తనకోసం అండగా నిలబడి ఓట్లు వేసిన వారందరికీ రాము రాథోడ్‌ తన కుటుంబంతో పాటు క్షమాపణాలు చెప్పాడు.

బిగ్‌బాస్‌ గురించి రాము  ఇలా చెప్పుకొచ్చాడు. ' నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్లు అందరూ  క్షమించండి. ఇదంతా నా కుటుంబం. వీళ్లందరినీ వదిలేసి తొలిసారిగా అన్నిరోజుల పాటు బయటే ఉండటం జరిగింది. దీంతో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ, కేవలం మీ అభిమానం వల్ల మాత్రమే బిగ్‌బాస్‌లో కొంతకాలమైన ఉండగలిగాను. ముఖ్యంగా మా అమ్మ, పిల్లలు గుర్తుకు రావడంతో హౌస్‌ నుంచి వచ్చేశాను. నా చిన్నతనం నుంచి నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. కేవలం బిగ్‌బాస్‌ కోసం అక్కడ వాళ్లతో గొడవపడటం కూడా నాకు నచ్చలేదు. 

నా వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండటం వల్ల హౌస్‌లో ఉండలేకపోయాను. కానీ, తనూజ మాత్రం  చాలాసార్లు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. ప్రేక్షకుల నిర్ణయం వరకు ఉండాలని కోరింది. హౌస్‌లోని వారందరూ ఎంత ధైర్యం ఇచ్చినప్పటికీ అక్కడ ఉండటం ఇబ్బందిగానే ఉండేది. నా నిర్ణయాన్ని ప్రేక్షకులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ రాము తన ఫ్యామిలీతో ఒక వీడియో పంచుకున్నాడు.

Videos

Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్

జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా

Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే

మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ

మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్

Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే

New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ

కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం

Photos

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)

+5

వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)

+5

అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)