Breaking News

అధ్యక్షా.. ఈ కమెడియన్‌ ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?

Published on Sun, 09/07/2025 - 22:01

అధ్యక్షా.. డైలాగ్‌తో పాపులర్‌ కాదు సెన్సేషన్‌ అయ్యాడు కమెడియన్‌ సుమన్‌ శెట్టి (Suman Shetty). ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఇతడు ఈ మధ్యకాలంలో సైలెంట్‌ అయిపోయాడు. చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే ఈసారి సినిమా ద్వారా కాదు, బిగ్‌బాస్‌ షో ద్వారా! తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ (Bigg Boss 9 Telugu)లో అడుగుపెట్టిన సుమన్‌ శెట్టి తన జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. 

తొలి సినిమాకే నంది అవార్డు
అధ్యక్షా.. నన్ను గుర్తుపట్టారా? సుమన్‌శెట్టిని.. చిన్నప్పటినుంచే సినిమాలంటే పిచ్చి. ఇంటర్‌ పూర్తయ్యాక ఓ మ్యాగజైన్‌లో కొత్త ఆర్టిస్టులు కావాలన్న ప్రకటన చూసి వెంటనే హైదరాబాద్‌ వెళ్లాను. దర్శకుడు తేజ నన్ను ఆడిషన్‌ చేసి సెలక్ట్‌ చేశారు. జై మూవీతో కెరీర్‌ మొదలైంది. ఫస్ట్‌ సినిమాకే నంది అవార్డు గెలిచాను. జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం సినిమాల్లో అవకాశాలిచ్చి తేజ గారు నాకు గాడ్‌ ఫాదరయ్యారు.

300 సినిమాలు
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశాను. అలా సినిమాలు చేస్తుండగా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేశారు. నాకు ఓ కూతురు, కొడుకు సంతానం. 2019లో మా నాన్న చనిపోయారు. నాన్న లేకపోయేసరికి ఒంటరితనం ఆవరించింది. నీ కెరీర్‌ మళ్లీ మొదలుపెట్టు అని అమ్మ తోడుగా నిలిచింది. బిగ్‌బాస్‌తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతాను. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ సుమన్‌ శెట్టి ఆటేంటో చూపిస్తా అన్నాడు సుమన్‌ శెట్టి. మరి ఈ కమెడియన్‌ బిగ్‌బాస్‌లో ఎంతమేరకు మెప్పిస్తాడో చూడాలి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)