Breaking News

నాకు చావెందుకు రాలేదు? నిరూపించుకోవడానికే వచ్చా: హీరోయిన్‌ కన్నీళ్లు

Published on Sun, 09/07/2025 - 22:24

సినిమాలకన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమసైంది సంజనా గల్రాని (Sanjana Galrani). బుజ్జిగాడు మూవీతో టాలీవుడ్‌లో పరిచయమైంది. తెలుగులో కన్నా కన్నడలో మంచి స్టార్‌డమ్‌ సంపాదించింది. 2020లో రహస్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం. అంతా బాగున్న సమయంలో డ్రగ్స్‌ కేసుతో తన కెరీర్‌ కుప్పకూలింది. డ్రగ్స్‌ కుంభకోణంలో జైలుకు కూడా వెళ్లొచ్చింది.  తాజాగా ఆమె తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో అడుగు పెట్టింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా పేరు అర్చన. ఏడో తరగతి చదువుతున్న సమయంలో మోడలింగ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. జాన్‌ ఇబ్రహీంతో ఓ యాడ్‌ చేశాను. అప్పుడు పూరీ జగన్నాథ్‌ నన్ను చూసి బుజ్జిగాడు సినిమాలో ఆఫర్‌ ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను. ఒకరోజు సడన్‌గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్‌ చేశారు. నాకు చావెందుకు రాలేదు? అని బాధపడ్డాను. ఆ రోజు గురించి తలుచుకుంటేనే బాధేస్తోంది.

ఒక్కో మీడియా ఛానల్‌ ఒక్కోలాగా చెప్పింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. కానీ, అదెవరికీ కనిపించలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్‌బాస్‌కు వచ్చాను అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)