Breaking News

హౌస్‌ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్‌!

Published on Thu, 09/11/2025 - 13:11

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలు సహజం. గొడవ మొదలుపెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికేవాళ్లుంటారు. ఈ సీజన్‌లో కూడా మూడు రోజుల్లోనే కావాల్సినదానికంటే ఎక్కువ రభసే జరుగుతోంది. దానికి మూల కారణం సంజనా (Sanjana Galrani)! ఈమె సరదాసరదాగా చేసే పనులకే హౌస్‌ తగలబడిపోతోంది. నిజంగా గొడవపడితే హౌస్‌ ఏమైపోతుందో మరి!

అందరికీ పూనకాలు తెప్పిస్తున్న సంజనా
తను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్‌లో ఉన్న 14 మంది ఒకచోట చేరి కొట్టుకున్నంత పని చేశారు. కానీ సంజనా మాత్రం తాపీగా సోఫాలో కూర్చుని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్‌ చేసింది. ఆ ఒక్క సీన్‌ చాలు.. నువ్వుండాలమ్మా.. కచ్చితంగా ఉండాల్సినదానివే! అని ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు. అవసరమైన చోట కౌంటర్స్‌ ఇస్తూ తాపీగా ఉంటోంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు. కానీ, అందరికీ బీపీలు తెప్పిస్తోంది. ప్రస్తుతానికి హౌస్‌లో ఈమెనే అందరికంటే హైలైట్‌గా నిలుస్తోంది.

కెప్టెన్‌గా..
ఇకపోతే నేడు కెప్టెన్సీ టాస్క్‌ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలక్ట్‌ చేయమని బిగ్‌బాస్‌ సంజనాకు బాధ్యత అప్పగించాడట! దాంతో ఆమె హరీశ్‌, శ్రష్టి, ఇమ్మాన్యుయేల్‌, డిమాన్‌ పవన్‌లను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి కెప్టెన్సీ సంజనా చేతికి చిక్కిందట! గుడ్డు దొంగిలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్‌. ఇప్పుడదే ఇంట్లో కెప్టెన్‌ బెడ్‌రూమ్‌లో దర్జాగా సేద తీరనుంది సంజనా. కెప్టెన్‌గా అందరినీ ఎలా ఆటాడిస్తుందో చూడాలి!

చదవండి: 5 నెలల పాప.. గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?: సంజనా ఫైర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)