Breaking News

భరణికి అన్యాయం! కనిపెట్టేసిన తనూజ

Published on Fri, 12/05/2025 - 08:47

టికెట్‌ టు ఫినాలే రేస్‌లో ఒక్కొక్కరూ అవుట్‌ అవుతూ రాగా చివరకు భరణి, సుమన్‌, పవన్‌ కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, రీతూ మిగిలారు. మరి వీరిలో ఎవరు గేమ్స్‌లో పాల్గొన్నారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది గురువారం (డిసెంబర్‌ 4వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

కల్యాణ్‌ విన్నర్‌
మొదటగా కలర్‌ గేమ్‌ ఛాలెంజ్‌లో భరణి, రీతూ, కల్యాణ్‌ ఆడారు. ఈ ఆటలో రీతూ గెలిచింది. అయితే రీతూ పూసిన పసుపు కలర్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ తనూజ.. రెడ్‌ కలర్‌ ఎక్కువగా ఉదంటూ కల్యాణ్‌ను విన్నర్‌గా ప్రకటించింది. అతడు తన ప్రత్యర్థిగా సుమన్‌ను ఎంచుకున్నాడు. వీరికి వస్తువులు పగలగొట్టే గేమ్‌ ఇచ్చారు. త్రాసులో ఎవరి వస్తువులు ఎక్కువ బరువుంటే వారే గెలిచినట్లు! 

టార్గెట్‌ భరణి
ఈ ఆటలో కల్యాణ్‌ గెలవడంతో సుమన్‌ రేసు నుంచి అవుట్‌ అయ్యాడు. ఇమ్మూ, రీతూ, కల్యాణ్‌.. కలిసి భరణిని టార్గెట్‌ చేశారు. ఇమ్మూ, కల్యాణ్‌.. రీతూను గెలిపించి.. ఆమె భరణితో పోటీపడేలా ప్లాన్‌ చేశారు. వీళ్ల ప్లాన్‌ తిప్పికొట్టేందుకు బిగ్‌బాస్‌ బ్యాలెన్స్‌ గేమ్‌ ఇచ్చాడు. అయినా బిగ్‌బాస్‌నే బురిడీ కొట్టించారిద్దరూ. ఈ గేమ్‌లో కల్యాణ్‌, ఇమ్మూ, రీతూ స్టిక్స్‌ పట్టుకుంటే దానిపై హౌస్‌మేట్స్‌ కాయిన్స్‌ పెట్టాల్సి ఉంటుంది.

ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అతడేనా?
ఇమ్మూ, కల్యాణ్‌ ముందుగా అనుకున్నట్లుగానే ఓడిపోవడంతో రీతూ గెలిచింది. రీతూ.. భరణిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. వీరికి ట్రయాంగిల్‌- స్క్వేర్‌ అంటూ ఓ గేమ్‌ పెట్టారు. సంజనా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రీతూ గెలిచింది. అయితే తనూజ మాత్రం.. రీతూ పెట్టిన ఓ ట్రయాంగిల్‌ సరిగా లేదని చెప్తుండగా ఎపిసోడ్‌ ముగిసింది. అదే నిజమైతే భరణికి అన్యాయం జరిగినట్లే! ఇక ఈ టికెట్‌ టు ఫినాలే కల్యాణ్‌ గెలిచినట్లు తెలుస్తోంది.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)