Breaking News

బిగ్‌బాస్‌లో షాకింగ్‌ ఎలిమినేషన్‌.. టాప్‌ కంటెస్టెంట్‌ ఔట్‌

Published on Sat, 10/18/2025 - 20:22

బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ వచ్చిన తర్వాత షో పరుగులు పెడుతుంది. ఈ వారం హౌస్‌ నుంచి ఎవరూ ఊహించని వ్యక్తి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే గతవారంలో ప్రేక్షకుల ఓటింగ్‌తో ప్రమేయం లేకుండానే షాకింగ్‌ ఎలిమినేషన్‌తో శ్రీజ దమ్ము బయటకు వచ్చేసింది.  ఈ వారం నామినేషన్‌ లిస్ట్‌లో ఉన్న భరణి, దివ్య, తనూజ, పవన్, రాము, సుమన్‌లలో టాప్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కానున్నారు. అందరూ దివ్య, రాములలో ఎవరైనా ఒకరు ఎలిమినేట్‌ అవుతారని అనుకున్నారు. కానీ, బిగ్‌బాస్‌ అతిపెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చేశాడు. ఒక టాప్‌ కంటెస్టెంట్‌ను హౌస్‌ నుంచి పంపించేశాడు.

ఈ వారం భరణి ఎలిమినేట్‌ అయిపోయారు. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఈ అదివారం బిగ్‌బాస్‌ నుంచి బయటకు రానున్నారు. కేవలం ఎక్కువ బాండిగ్స్‌ పెట్టుకోవడం వల్లే భరణి ఎలిమినేట్‌ అయ్యారని తెలుస్తోంది. ఆపై ఈ వారంలో సంజన మీద ఆయన ఫైర్‌ తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఆపై అతని గేమ్‌ స్ట్రాటజీని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. టాప్‌లో తనే ఉన్నాననే భ్రమలో భరణి ఉండటంతో గేమ్‌పై పట్టు కోల్పోయారు. 

ముఖ్యంగా దివ్య వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన సమయంలో భరణిని టాప్‌ 2లో ఉన్నారని చెప్పింది. ఆపై  అతనితోనే దివ్య ఉండటంతో నమ్మేశాడు. దీంతో ఆయనలో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పెరిగిపోయింది. ఏకంగా తనను నామినేట్‌ చేసిన వారందరూ హౌస్‌ నుంచి వెళ్లిపోయారని కూడా కామెంట్‌ చేశారు. అంతలా తనపై తాను అతి నమ్మకం పెట్టుకున్నారు.  ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో ఉన్న భరణి ఆట చూసి ఇంట్లోకి వెళ్లిన దివ్య కూడా సలహాలు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆట పతనానికి దారి తీసింది.  కేవలం తన స్వయం కృతాపరాధం వల్లే భరణ ఎలిమినేట్‌ అయ్యారని చెప్పవచ్చు. అయితే, ఎలాంటి నెగటివిటి లేకుండా బిగ్‌బాస్‌ నుంచి వచ్చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)