Breaking News

అంతా చీటింగే అన్న భరణి.. ఫస్ట్‌ ఫైనలిస్ట్‌గా కల్యాణ్‌

Published on Fri, 12/05/2025 - 11:52

నామినేషన్స్‌లో కూడా నవ్వుతూ ఉన్న భరణి.. టాస్కుల్లో మాత్రం ఫైర్‌ చూపించాడు. ఇప్పుడేకంగా కయ్యానికి కాలు దువ్వాడు. నిన్నటి టాస్క్‌ కాస్త గందరగోళంగా నడిచిన సంగతి తెలిసిందే కదా! దానికి కొనసాగింపుగా తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో భరణి.. సరిగా త్రిభుజాకారం లేని వస్తువుని ట్రయాంగిల్‌ అని ఎలా అంటారు? అని మండిపడ్డాడు. ఇప్పటికే కల్యాణ్‌, ఇమ్మూ కలిసి గ్రూప్‌గేమ్‌ ఆడుతున్నారని పసిగట్టిన భరణి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకునేందుకు సిద్ధపడలేదు.

భరణి ఫ్రస్టేషన్‌
సంజనా సంచాలకురాలిగా తప్పు చేసిందని వాదించాడు. మరోవైపు రీతూ.. ఎవరైనా ఒకరు గెలిస్తే దాన్ని రచ్చ చేయాలి, చెండాలం చేయాలి. ఒకరు హ్యాపీగా ఉండకూడదు! అని అసహనం వ్యక్తం చేసింది. సీజన్‌లో ఎక్కడెక్కడ చీటింగ్‌ జరిగాయి? ఎక్కడెక్కడ షూ చూపిస్తే మనుషుల్ని గుర్తుపట్టారు.. మొత్తం వీడియోలతో సహా బయటకు వచ్చాయి. అయినా సరే, ఇప్పటికీ నోరు మూసుకునే కూర్చున్నా అంటూ తన ఫ్రస్టేషన్‌ అంతా వెళ్లగక్కాడు. 

చీటింగ్‌తో కల్యాణ్‌ కెప్టెన్‌
ఇంతకీ ఆ షూ గొడవేంటంటే.. కళ్లకు గంతలు కట్టి లైట్లు ఆఫ్‌ చేసే కెప్టెన్సీ టాస్క్‌లో కల్యాణ్‌ (Pawan Kalyan Padala) లైట్‌ ఆఫ్‌ చేసిందని భరణి అని పవన్‌.. అతడివైపు షూ చూపిస్తూ సిగ్నల్‌ ఇచ్చాడు. అలా ఆ వారం కల్యాణ్‌ కెప్టెన్‌ అయ్యాడు. దాన్నే తర్వాత తనూజకు కన్ఫెషన్‌ రూమ్‌లో వీడియో వేసి మరీ చూపించారు. భరణి బయటకు వెళ్లొచ్చాక ఆ ఎపిసోడ్‌ చూశాడు కాబట్టి తనకూ తెలిసిపోయింది. 

ఫస్ట్‌ ఫైనలిస్ట్‌గా కల్యాణ్‌
మరి కల్యాణ్‌కి ఎలా తెలిసిందంటే.. శ్రీజ రీఎంట్రీ ఇచ్చి కల్యాణ్‌కు కావాల్సినన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చింది. అందులో భాగంగా ఈ తతంగాన్ని బయటపెట్టింది. కానీ ఇదే విషయాన్ని డిమాన్‌ పవన్‌తో మాత్రం చర్చించలేదు. అందుకే ప్రోమోలో కూడా వీళ్లు దేని గురించి అంటున్నారో తెలియక పవన్‌ సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు. భరణి, కల్యాణ్‌ మాత్రం కొట్టుకునేంతలా పైపైకి వెళ్లారు. ఈ గొడవను పక్కనపెడితే ఈ సీజన్‌లో కల్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయినట్లు తెలుస్తోంది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)