Breaking News

టాప్‌ 5 ఛాన్స్‌ మిస్‌.. భరణి ఎలిమినేషన్‌కు కారణాలివే!

Published on Mon, 12/15/2025 - 15:36

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొదట్లో కామనర్స్‌ను అసహ్యించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కామనర్స్‌ టాప్‌ 5లో ఉన్నారు. భరణి మెచ్యూరిటీ, ఆటను మెచ్చుకున్నారు. కానీ మధ్యలో ట్రాక్‌ తప్పడంతో ఆయన్ను ఆరువారాలకే ఎలిమినేట్‌ చేశారు. 

కామనర్‌ శ్రీజ, భరణిలో ఒకర్ని మళ్లీ తీసుకొస్తే.. జనం శ్రీజ ఓవరాక్షన్‌ తట్టుకోలేక భరణికి ఓటేశారు. అలా ఎనిమిదో వారం హౌస్‌లోకి వచ్చిన భరణి ఫైనల్స్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. పద్నాలుగో వారం హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. అందుకు గల కారణాలేంటో చూద్దాం...

నలిగిపోయిన భరణి
భరణి మొదట ఎలిమినేట్‌ అయిందే బంధాల వల్ల! అటు తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్‌ ఆడండి అని నాగార్జున వార్నింగ్‌ ఇచ్చినా పరిస్థితి మారలేదు. బంధాల వల్ల తనను తాను కోల్పోయినవాడిలా మిగిలిపోయాడు. ఎలిమినేషన్‌ తర్వాత తప్పొప్పులు తెలుసుకున్నాడు. స్ట్రాంగ్‌ రీఎంట్రీ ఇచ్చాడు. బంధాలు అడ్డు కాకూడదని భావించాడు. తనూజ, దివ్యను కాస్త దూరం పెట్టాడు.

ఫ్యామిలీ వీక్‌తో మార్పు
కానీ దివ్య ఫెవికాల్‌లా అతడికి అతుక్కుపోయింది. ఓపక్క సపర్యలు చేస్తుంది, మరోపక్క వెళ్లిపోమని నామినేషన్‌ చేస్తుంది. కానీ అతడిని ఆజమాయిషీ చేయడమే ఎవరికీ నచ్చలేదు. కొన్నివారాలపాటు భరణి దాన్ని మౌనంగానే భరించినా అది అతడి చేతకానితనంగా మారిపోయింది. అతడి అభిమానులకు అది నచ్చలేదు. ఫ్యామిలీ వీక్‌లో ఇంటిసభ్యులందరూ కూడా.. నీపై పెత్తనం చెలాయిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని కడిగిపారేశారు. దీంతో అప్పటినుంచి దివ్యను దూరం పెట్టాడు. కొన్నిసార్లు సంబంధం లేకపోయినా కోప్పడ్డాడు.

విమర్శలు
భరణి ధోరణి చూసిన వారికి అతడు సహజంగా ఉండట్లేదన్న అనుమానం మొదలైంది. మొదట్లో రేలంగి మామయ్యలా ఉన్న భరణి.. సెకండ్‌ ఎంట్రీలో మాత్రం ఫైర్‌ చూపించాడు. ఆ ఫైర్‌ మాటల్లో ఉంది కానీ గేమ్‌లో మాత్రం పెద్దగా చూపించలేకపోయాడు. అతడిని రికమండేషన్‌తో ఫైనల్‌కు తీసుకెళ్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా పలు కారణాల రీత్యా ఆయన్ను ఫినాలేకు ఒక వారం ముందు పంపించేశారు.

చదవండి: కప్పు నువ్వే గెలవాలి: భరణి

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)