Breaking News

అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్‌బాస్‌ వాయిస్‌ తేడాగా ఉందే!

Published on Sat, 08/16/2025 - 12:27

ప్రతి ఏడాది బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show) వస్తుంది. అది కామన్‌.. కానీ, ఈసారి బిగ్‌బాస్‌ కంటే ముందు అగ్నిపరీక్ష వస్తోంది. సామాన్యులను సెలక్ట్‌ చేసే ప్రోగ్రామ్‌ ఇది. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంతో ఘనంగా ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్‌ను జరిపించనున్నారు. దీనికి బిగ్‌బాస్‌ మాజీ విన్నర్స్‌ అభిజిత్‌ (Abhijeet), బిందు మాధవి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నవదీప్‌ జడ్జిలుగా వ్యవహరించనున్నారు.

నా తడాఖా చూపిస్తా!
తాజాగా పెద్దపులి అభిజిత్‌ మళ్లీ వచ్చాడంటూ హాట్‌స్టార్‌ ఓ ప్రోమో రిలీజ్‌ చేసింది. అందులో అభిజిత్‌ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్‌గా వచ్చిన నన్ను.. ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారు.. థాంక్యూ! ఇప్పటిదాకా నన్ను స్వీట్‌ చాక్లెట్‌ బాయ్‌గానే చూశారుకదా.. ఈ ఆగస్టు 22 నుంచి నా జడ్జిమెంట్‌ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్‌బాస్‌తో సహా వాళ్లకూ (కంటెస్టెంట్స్‌కు) చూపిస్తా.. అన్నాడు. అయితే ఈ వీడియోలో బిగ్‌బాస్‌ వాయిస్‌ మారింది. గంభీరంగా వినిపించే బిగ్‌బాస్‌ గొంతుక పేలవంగా మారిపోయింది. 

గొంతు మారిపోయింది
మరి ఇది ప్రోమో వరకేనా? లేదా అగ్నిపరీక్ష షోలో, బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో కూడా ఇదే గొంతు వినిపిస్తుందా? అని చాలామంది డౌట్‌ పడ్డారు. దీంతో హాట్‌స్టార్‌ ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్‌ కోసమే ఈ కొత్త వాయిస్‌ వాడామని, బిగ్‌బాస్‌ షోలో పాత గొంతే వినిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఇకపోతే అగ్నిపరీక్ష.. ఆగస్టు 22 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ అగ్నిపరీక్షలో సెలక్ట్‌ అయిన కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ 9లో కామనర్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు.

 

 

చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్‌ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)