Breaking News

నామినేషన్స్‌ రచ్చ.. సంస్కారం ఉందా అంటూ ప్రశ్నించిన గీతూ

Published on Mon, 09/19/2022 - 16:44

బిగ్‌బాస్‌ ఇంట్లో మూడోవారం నామినేషన్స్‌ హీట్‌ మొదలైంది. డబుల్‌ ఎలిమినేషన్‌తో జలక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ ఈసారి నామినేషన్స్‌లోనూ తాము చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పాల​ంటూ ఆదేశించాడు. దీంతో ఇంటిసభ్యుల మధ్య కౌంటర్‌ వార్‌ నడిచింది. ఇప్పటికే గేమ్‌ ఆడకుండా డల్‌గా కూర్చున్నావని సత్యను నాగార్జున క్లాస్‌ పీకినా ఆమె తీరులో పెద్దగా మార్పు లేనట్లే కనిపిస్తుంది.

ఇనయాను సత్య నామినేట్‌ చేయగా, నీకు గేమ్‌ ఆడాలనే లేదు కూర్చొని ముచ్చట్లు చెప్పాలి,ఇది చాలా సిల్లీ నామినేషన్‌ అంటూ ఇనయా ఆమె పరువు తీసేసింది. దీనికి సత్య కొత్తగా చెప్పేదేముంది సిల్లీ నామినేషన్‌ అని ఆన్సర్‌ ఇచ్చింది. ఇక ఇనయా, ఆదిరెడ్డిలు కూడా గట్టిగానే వాగ్వివాదానికి దిగారు. మీరు గేమ్‌ మొత్తం తెలుసుకొనే వచ్చారు అని ఇనయా చెప్పగా, 105రోజులు ఉండే హౌస్‌లో గేమ్‌ తెలుసుకొనే వస్తారు కదా అంటూ ఆదిరెడ్డి కౌంటర్‌ ఇచ్చాడు.అయినప్పటికీ ఇనయా ఎప్పటిలాగే వాదిస్తుంటే సహనం కోల్పోయిన ఆదిరెడ్డి బిగ్ బాస్.. పళ్లెం ఎత్తేస్తా చెప్తున్నా అంటూ ఫైర్‌ అయ్యాడు. 

చలాకీ చంటీ, గీతూ రాయల్‌ మధ్య సంస్కారం గురించి గొడవ జరిగింది. వయసుకు గౌరవం ఇవ్వనని గీతూ చెప్పగా.. మనం పదిమందితో ఉన్నప్పుడు సంస్కారంతో నడుచుకోవాలి అని చంటీ బదులిచ్చాడు. దీనికి కౌంటర్‌గా ముందు నువ్వు కరెక్టుగా ఉన్నావో లేదో చూసుకో తర్వాత సంస్కారం గురించి మాట్లాడు అని పేర్కొంది. ఇక లాస్ట్‌లో సుదీప గీతూని నామినేట్‌ చేసింది. కారణం తెలీదు కానీ తన బేబీ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది. మొత్తానికి ఇవాల్టి నామినేషన్స్‌లో హౌస్‌మేట్స్‌ మధ్య డైలాగ్‌ వార్‌ నడిచినట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. చూడాలి మరి ఈ ఫైర్‌ ఎపిసోడ్‌ మొత్తం ఉంటుందో లేదో.

Videos

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)