Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..
Breaking News
అందుకు బిగ్‌బాస్‌కి వచ్చా: సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్
Published on Sun, 09/04/2022 - 18:34
Shrihan In Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్-5లో సిరి బాయ్‌ఫ్రెండ్‌గా పాపులర్ అయిన శ్రీహాన్ గతంలో షార్ట్‌ఫిల్మ్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సిరితో కలిసి పలు షార్ట్‌ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్ముఖ్ లవ్‌ట్రాక్ వారిద్దరికి నెగిటివిటీని తెచ్చిపెడితే, శ్రీహాన్‌కు మాత్రం కలిసొచ్చింది. బిగ్‌బాస్ స్టేజ్‌పై శ్రీహాన్ మాట్లాడిన మాటలు, పాట పాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది.
సిరిపై సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ చేస్తున్న శ్రీహాన్ మాత్రం ఆమెకు అండగా నిలబడ్డాడు. ఇలా సిరి బాయ్‌ఫ్రెండ్‌గా వార్తల్లో నిలిచిన శ్రీహాన్ బిగ్‌బాస్ -6లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారే అవకాశం ఉంది. మరి శ్రీహాన్ పాజిటివిటీతోనే షో నుంచి బయటకు వస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Tags : 1