Breaking News

Bigg Boss 6: రాత్రంతా గీతూ గలాట.. శ్రీహాన్‌కు బిగ్‌ షాక్‌!

Published on Wed, 09/14/2022 - 16:51

రెండోవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్స్‌కి సిసింద్రి టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో ఫైమా, రేవంత్‌, చలాకి చంటి పాల్గొనగా.. అందరికంటే ముందు టాస్క్‌ కంప్లీట్‌ చేసి తొలి కెప్టెన్సీ పోటిదారుడిగా నిలిచాడు చంటి. ఇక రాత్రి కావడంతో కెప్టెన్సీ టాస్క్‌ని ఆపేశాడు బిగ్‌బాస్‌. టాస్క్‌ సమయం పూర్తయినందున తదుపరి ఆదేశం వరకు తమ బేబీ బొమ్మలను ప్రతి కంటెస్టెంట్‌ జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆదేశం ఇచ్చాడు. అయితే బొమ్మలను దాచుకోవడానికి వీలు లేదంటూ చివరిలో ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. 

తమకి ఇచ్చిన బొమ్మలు లాస్ట్ అండ్ ఫౌండ్‌కి వెళ్లకుండా చూసుకోవడంతో పాటు బిగ్‌బాస్‌ ఇచ్చిన చాలెంజ్‌లో గెలవడమే కంటెస్టెంట్స్‌ ప్రస్తుత టాస్క్‌.  ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమోను తాజాగా వదిలాడు బిగ్‌బాస్‌. ఈ తాజా ప్రోమోలో గలాట గీతూ తన చేతివాటం చూపించింది. రాత్రంత నిద్ర పోకుండా బొమ్మలు దొంగలించేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా కెప్టెన్‌ ఆదిత్య బొమ్మను దొంగలించి తీసుకెళుతుండగా.. ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకుని ఆదిత్యను బతికించారు. మరోవైపు శ్రీహాన్‌.. అర్జున్‌ నిద్రపోతుండటం చూసి మెల్లిగా అతడి బొమ్మను దొంగలించి లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌లో వేశాడు. ఇటూ సమయం కోసం కాచుకు కూర్చున్న గీతూ తన ప్లాన్‌ను ఇంప్టీమెంట్‌ చేసి సక్సెస్‌ అయ్యింది. 

తను టార్గెట్‌ చేసిన ఇద్దరిలో ఒకరైన శ్రీహాన్‌ బొమ్మను దొంగలించి లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌లో పెట్టేసింది. గీతూ గలాట చూసి హౌజ్‌మెట్స్‌లో సగం మంది రాత్రి మూడు గంటల వరకు పడుకోలేదు. చూస్తుంటే గీతూ వల్ల శ్రీహాన్‌ ఈ కెప్టెన్సీ పోటీ నుంచి వైదొలిగినట్టే కనిపిస్తోంది. మరి శ్రీహాన్‌ తన బొమ్మను కాపాడుకున్నాడా? లేక గీతూ చేతిలో బుక్కయ్యాడా? తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే. ఇక గీతూ ముందురోజు ఎపిసోడ్‌లో కూడా రేవంత్, అభినయ శ్రీ, శ్రీ సత్య బొమ్మలను ఆమె లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ వేసి వారిని కెప్టెన్సీ పోటీకి అనర్హులుగా చేసింది. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)